e-Rickshaw: ఆటోకు ఛార్జింగ్ పెడుతూ వ్యక్తి మృతి

ఈ- బైక్‌లు, ఈ-కార్‌లే కాదు ఈ రిక్షాలు రొటీన్ లైఫ్‌లో భాగమయ్యాయి. ఇలాంటి సమయంలో అక్కడక్కడ కొన్ని పారబాట్లు దొర్లుతూనే ఉన్నాయి. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉండే ఈ-ఛార్జింగ్ స్టేషన్లో పనిచేస్తున్న మహేందర్ సింగ్ విద్యుత్ సరఫరా కారణంగా మృతి చెందాడు.

e-Rickshaw: ఆటోకు ఛార్జింగ్ పెడుతూ వ్యక్తి మృతి

dead body

 

e-Rickshaw: ఈ- బైక్‌లు, ఈ-కార్‌లే కాదు ఈ రిక్షాలు రొటీన్ లైఫ్‌లో భాగమయ్యాయి. ఇలాంటి సమయంలో అక్కడక్కడ కొన్ని పారబాట్లు దొర్లుతూనే ఉన్నాయి. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉండే ఈ-ఛార్జింగ్ స్టేషన్లో పనిచేస్తున్న మహేందర్ సింగ్ విద్యుత్ సరఫరా కారణంగా మృతి చెందాడు.

డీసీపీ సమీర్ శర్మ మాట్లాడుతూ.. ” శనివారం మహేందర్ గురించి హాస్పిటల్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎలక్ట్రిక్ షాక్ తగలడంతో అతని యజమాని హాస్పిటల్ కు తీసుకొచ్చాడు. తీవ్రగాయాలతో సతమతమై మృతి చెందాడు” అని తెలిపారు.

విచారణలో మహేందర్ చందర్ విహార్ లో పనిచేస్తున్నట్లుగా తెలిసింది. ఒక ఈ-ఆటో రిక్షాకు ఛార్జింగ్ పెడుతుండగా ఎలక్ట్రిక్ షాక్ తగిలింది. పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాన్ని అతని తండ్రి ప్రేమ్ సింగ్ కు అప్పగించామని పోలీసులు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తుల నిర్లక్ష్యంతో జరిగినట్లు కేసు నమోదైంది.

Read Also : ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 1,000 కిలోమీటర్లు నడిచే బ్యాటరీ

“అటాప్సీ రిపోర్ట్ అనంతరం నిందితులపై లీగల్ యాక్షన్ తీసుకుంటాం. ఛార్జింగ్ స్టేషన్లో మెషీన్లను, వెహికల్ కండిషన్ ను చెక్ చేసేందుకు ఒక టీంను పంపించామని” పోలీస్ అధికారి పేర్కొన్నారు.