online rummy: ఆన్‌లైన్ రమ్మీ డబ్బులు కట్టేందుకు దొంగతనం

ఆన్‌లైన్ రమ్మీ గేమ్ చాలా మంది జీవితాలను నాశనం చేస్తోంది. తాజాగా ఈ గేమ్‌లో లక్షలు పోగొట్టుకున్న ఒక వ్యక్తి, దొంగతనానికి పాల్పడి కటకటాల పాలయ్యాడు.

online rummy: ఆన్‌లైన్ రమ్మీ డబ్బులు కట్టేందుకు దొంగతనం

Online Rummy

online rummy: ఆన్‌లైన్ రమ్మీ గేమ్ చాలా మంది జీవితాలను నాశనం చేస్తోంది. తాజాగా ఈ గేమ్‌లో లక్షలు పోగొట్టుకున్న ఒక వ్యక్తి, దొంగతనానికి పాల్పడి కటకటాల పాలయ్యాడు. ముంబైకు చెందిన రోషన్ దాల్వి అనే యువకుడు ఆన్‌లైన్ రమ్మీ గేమ్‌కు అడిక్ట్ అయ్యాడు. ఈ గేమ్‌ ఆడి, లక్షలు పోగొట్టుకున్నాడు. తల్లిదండ్రులు పంపిన డబ్బుతోపాటు, స్నేహితుల నుంచి కూడా చాలా డబ్బులు తీసుకుని ఆన్‌లైన్ రమ్మీ గేమ్ ఆడాడు. అయితే, ఆ గేమ్‌లో డబ్బంతా పోగొట్టుకున్నాడు. దీంతో స్నేహితులు, బంధువుల అప్పు ఎలా తీర్చాలో తెలియలేదు. అప్పు తీర్చేందుకు దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు. అదే సమయంలో రోషన్ దాల్వి ఒక హౌజింగ్ సొసైటీలో పార్ట్ టైమ్ మేనేజర్‌గా పని చేసేవాడు. ఈ సొసైటీకి ఒక ఆఫీస్ ఉంది.

Cyber Fraud : హైదరాబాద్‌లో భారీ సైబర్‌ ఫ్రాడ్‌.. మహిళ ఖాతాలోంచి రూ.24 లక్షలు కొట్టేశారు

అందులోని వాల్టర్‌లో లక్షల డబ్బు ఉండేది. ఆ వాల్టర్‌ను కీ, పాస్‌వర్డ్ వంటివి లేకుండా తెరవడం సాధ్యం కాదు. కాబట్టి, రోషన్ నేరుగా ఆ వాల్టర్ ఎత్తుకెళ్లాడు. అందులో దాదాపు 5.4 లక్షల క్యాష్ ఉంది. గత నెల 27న సొసైటీ సభ్యులకు ఆఫీస్‌లో వాల్టర్ కనిపించలేదు. దీంతోపాటు మేనేజర్‌గా పనిచేస్తున్న రోషన్ కూడా కనిపించకుండా పోయాడు. హౌజింగ్ సొసైటీ సభ్యులు సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా, రోషన్ వాల్టర్‌ను ఎత్తుకెళ్లిన దృశ్యాలు రికార్డయ్యాయి. సభ్యులంతా కలిసి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు జరిపిన పోలీసులు రోషన్‌ను అరెస్టు చేశారు.