Mango Leaves : షుగర్ లెవల్స్ తగ్గించే మామిడాకులు…ఎలా ఉపయోగించాలో తెలుసా?..

డయాబెటిస్ తో బాధ పడుతున్న వాళ్ళు ప్రతిరోజు మామిడి ఆకుల రసాన్ని తీసుకోవడం వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది. 10 నుండి 15 మామిడాకులను తీసుకుని వాటిని బాగా కడిగి 100 లేదా 150 ఎంఎల్‌ నీటి

Mango Leaves :  షుగర్ లెవల్స్ తగ్గించే మామిడాకులు…ఎలా ఉపయోగించాలో తెలుసా?..

Mango Leaves

Mango Leaves :  పండగ వచ్చినా, శుభకార్యం చేస్తున్నా ముందుగా గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాల్సిందే. ఇది హిందూసాంప్రదాయంలో అనాదిగా వస్తున్న ఆచారం. దీనివెనక సైంటిఫిక్ రీజన్స్ ఉండటం వల్ల మామిడాలకును తప్పనిసరిగా గుమ్మాలకు కడతారు. అయితే మామిడి ఆకుల్లో అనేక ఆరోగ్య రహస్యాలు దాగున్నాయి. డయాబెటిస్, ఆస్తమా వంటి వ్యాధులను నయం చేసే గుణం వీటికి ఉంది.

ప్రపంచంలో అధిక శాతం మంది ప్రజలు షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఒక్కసారి ఈ వ్యాధి బారిన పడిన వారు జీవితాంతం మందులు వాడుకోవాల్సి వస్తుంది. షుగర్ లెవల్స్ అదుపులోకి తెచ్చుకునేందుకు వారు పడే తంటాలు అన్నీ ఇన్నీ కావు. అయితే షుగర్ లెవెల్స్ ను తగ్గించుకునేందుకు మామిడాకులు బాగా పనిచేస్తాయని అనేక పరిశోధనల్లో తేలింది. ఇందులో ఉండే పోషకాలు షుగర్ స్ధాయిలను తగ్గించేందుకు బాగా దోహదపడతాయని పరిశోధకులు చెబుతున్నారు.

మామిడాకుల వల్ల శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి పెరగటంతోపాటు, గూక్లోజ్ సక్రమంగా వినియోగించబడి చక్కెరస్ధాయిలు అదుపులో ఉంటాయి. మామిడి ఆకుల్లో పెక్టిన్, ఫైబర్, విటమిన్ సి లు ఉంటాయి. షుగర్ లెవల్స్ తగ్గటంతోపాటు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. మామిడి ఆకుల రసాన్ని ఎలుకలపై ప్రయోగించటం ద్వారా పరిశోధకులు పలు విషయాలను గ్రహించారు. ఎలుకలకు మామిడి ఆకుల రసాన్ని ఇవ్వడం వల్ల తక్కువ గ్లూకోజ్ స్థాయిలను గ్రహిస్తాయి అని, రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచడంలో మామిడాకులు బాగా పనిచేస్తాయని శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెల్లడైంది.

డయాబెటిస్ తో బాధ పడుతున్న వాళ్ళు ప్రతిరోజు మామిడి ఆకుల రసాన్ని తీసుకోవడం వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది. 10 నుండి 15 మామిడాకులను తీసుకుని వాటిని బాగా కడిగి 100 లేదా 150 ఎంఎల్‌ నీటిలో వేసి బాగా మరిగించాలి. అనంతరం వచ్చే కషాయాన్ని రాత్రంతా అలాగే ఉంచాలి. తరువాత రోజు ఉదయాన్నే ఆ కషాయాన్ని పరగడుపునే తాగాలి. ఇలా చేయటం వల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయి.

డయాబెటిస్‌ వల్ల రాత్రి పూట కొందరు తరచూ మూత్ర విసర్జన చేస్తుంటారు. మామిడి ఆకుల నీటిని తీసుకోవటం వల్ల ఆ సమస్యను తగ్గించుకోవచ్చు. మామిడి ఆకుల లో విటమిన్ ఎ, సి, బిఅధికంగా ఉండటం వల్ల నిరోధక శక్తి పెరుగుతుంది. ఆకులతో టీ తయారు చేసుకొని తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తొలగించవచ్చు.

అధిక బరువును తగ్గించడానికి కూడా మామిడాకులతో తయారు చేసుకున్న టీ సహాయ పడుతుంది. మామిడి ఆకుల్లో యాంటీ ఆక్సింట్స్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు మామిడి ఆకుల పేస్ట్ అప్లై చేయడం వల్ల త్వరగా వాటినుండి బయటపడవచ్చు. ఎక్కిళ్లు, గొంతు ఇన్ఫెక్షన్స్ నివారించడంలో మామిడాకులు ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. జీర్ణక్రియను సక్రమంగా జరిగేటట్లు చేస్తుంది. అలాగే మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది.

మామిడాకులను నీడలో ఎండబెట్టి పొడి చేసి రోజుకు రెండు సార్లు అర టీ స్పూను మోతాదులో గ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి రోజుకు రెండు సార్లు తీసుకోవాలి. ఇలా మూడు నెలలపాటు చేస్తే షుగర్ వ్యాధి గ్రస్తులకు మంచి ఫలితం ఉంటుంది. ఆస్తమా, బ్రాంకైటిస్, జ్వరం వంటి సమస్యలను తగ్గించటంలో మామిడి ఆకులు బాగా పనిచేస్తాయి.