Mars Helicopter : అంగారకుడిపై నాసా హెలికాప్టర్

అంగారకునిపై ఉన్నా నాసా హెలికాఫ్టర్‌ అక్కడి వాతావరణంలో ఎగిరేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం మార్స్‌పై తీవ్రమైన శీతాకాల పరిస్థితులు ఉన్నాయని.. తమ ప్రణాళిక నిజమైతే చారిత్రక హెలికాఫ్టర్‌ను ఎగిరేలా చేస్తామన్ని నాసా ప్రకటించింది.

Mars Helicopter  : అంగారకుడిపై నాసా హెలికాప్టర్

Nasa

Nasa : అంగారకునిపై ఉన్నా నాసా హెలికాఫ్టర్‌ అక్కడి వాతావరణంలో ఎగిరేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం మార్స్‌పై తీవ్రమైన శీతాకాల పరిస్థితులు ఉన్నాయని.. తమ ప్రణాళిక నిజమైతే చారిత్రక హెలికాఫ్టర్‌ను ఎగిరేలా చేస్తామన్ని నాసా ప్రకటించింది. మార్స్‌పై ఉపరితలం చాలా కఠినంగా ఉందని నాసా ప్రకటించింది. దీని వల్ల రోవర్‌ సహాయంతో మార్స్‌పై అన్ని ప్రాంతాలను స్పష్టంగా చూసేందుకు వీలు లేదని తెలిపింది. ఇప్పుడు ఈ హెలికాప్టర్ సాయంతో ఆ పని పూర్తిచేయవచ్చనని నాసా పేర్కొంది.

అరుణ గ్రహంపై హెలికాప్టర్‌ ఎగరడం ఇదే మొదటిసారి. నాసా హెలికాప్టర్‌ ఎలా ఎగురుతుందో చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజానికి ఈ హెలికాప్టర్‌ ఎగిరే కార్యక్రమం ఏప్రిల్ 11 న జరగాల్సి ఉండగా.. పలు సాంకేతిక సమస్యల కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు హెలికాప్టర్‌ ఎగిరే కార్యక్రమాన్ని తమ వెబ్‌సైట్‌ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు కూడా నాసా ఏర్పాట్లు పూర్తిచేసింది.

హెలికాప్టర్‌ను పర్యవేక్షించే బృందం దాని సాఫ్ట్‌వేర్‌ను కూడా ఆధునీకరించింది. మూడు రోజుల క్రితం నిర్వహించిన పరీక్షల్లో హెలికాప్టర్ వేగవంతమైన స్పిన్ పరీక్షలో సక్సెస్‌ అయింది. డాటా అందుకున్న తర్వాత నాసా ఈ విషయాన్ని వెల్లడించింది. హెలికాప్టర్‌ ఎనర్జీ కమ్యూనికేషన్ సిస్టమ్ కూడా బాగా పనిచేస్తోందని తెలిపింది. హెలికాప్టర్ టేకాఫ్ చేసి కొంత దూరం వెళ్ళగలిగితే.. మిషన్ 90 శాతం విజయవంతమైనట్లుగా పరిగణించనుంది. ల్యాండింగ్‌ కూడా విజయవంతమైతే.. మరో నాలుగు హెలికాప్టర్‌ పరీక్షలు జరిపేందుకు నాసా సిద్ధమవుతోంది.

Read More : Indian Railway Covid : కరోనా కల్లోలం, ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ పేరిట ప్రత్యేక రైలు