Raviteja : ‘మాస్ మహారాజా’ రవితేజ బర్త్‌డే స్పెషల్ అప్‌డేట్స్..

మాస్ మహారాజా రవితేజ.. తెలుగు ప్రేక్షకులకు, అభిమానులకు బర్త్‌డే ట్రీట్ రెడీ చేస్తున్నారు..

Raviteja : ‘మాస్ మహారాజా’ రవితేజ బర్త్‌డే స్పెషల్ అప్‌డేట్స్..

Mass Maharaja Raviteja Birt

Updated On : January 26, 2022 / 10:34 AM IST

Raviteja: మాస్ మహారాజా రవితేజ.. తెలుగు ప్రేక్షకులకు, అభిమానులకు బర్త్‌డే ట్రీట్ రెడీ చేస్తున్నారు. ఒకటి, రెండు కాదు.. ముచ్చటగా మూడు సినిమాల అప్‌డేట్లతో సోషల్ మీడియాను షేక్ చెయ్యబోతున్నారు. రేపు (జనవరి 26) రవితేజ 54వ పుట్టినరోజు.

Unstoppable : బాలయ్య-రవితేజ.. ఎవరికి భార్య అంటే షేక్ మస్తాన్? ప్రోమో అదిరింది..

ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాలకు సంబంధించి న్యూ అప్‌డేట్స్ రిలీజ్ చెయ్యబోతున్నారు మేకర్స్. ఉదయం 10:08 గంటలకు రమేష్ వర్మ దర్శకత్వంలో డ్యూయెల్ రోల్ చేస్తున్న ‘ఖిలాడి’ నుండి ‘ఫుల్ కిక్కు’ అనే సాంగ్ విడుదల చేస్తున్నారు.

Anveshi Jain : ‘రామారావు’తో రచ్చ రంబోలా..

మధ్యాహ్నం 12:06 గంటలకు కొత్త దర్శకుడు శరత్ మండవ డైరెక్ట్ చేస్తున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ అప్‌డేట్ (గ్లింప్స్) ఇవ్వనున్నారు. అలాగే సాయంత్రం 4:05 గంటలకు త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో నటిస్తున్న ‘ధమాకా’ (గ్లింప్స్) మూవీ అప్‌డేట్ రాబోతుంది.

Raviteja 71 : ‘టైగర్ నాగేశ్వరరావు’ గా మాస్ మహారాజా!

వీటితో పాటు మెగాస్టార్ చిరంజీవి, యంగ్ డైరెక్టర్ కెయస్ రవీంద్ర (బాబీ) కాంబోలో.. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమాలో రవితేజ, చిరు తమ్ముడిగా నటించనున్నట్లు వస్తున్న వార్తల గురించి క్లారిటీ రానుంది. రవితేజ కొత్త సినిమా ‘టైగర్ నాగేశ్వర రావు’, ‘రావణాసుర’ సినిమాల నుండి బర్త్‌డే పోస్టర్లు రిలీజ్ చేస్తారని సమాచారం.

Ravi Teja 70 : ‘రావణాసుర’ గా రవితేజ