Jharkhand: ఘోర రోడ్డు ప్రమాదం.. 16 మంది మృతి.. 26 మందికి గాయాలు

జార్ఖండ్‌లోని పాకుర్ జిల్లాలో బుధవారం ఉదయం ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న లారీ, ఎదురుగా వస్తున్న బస్సు ఒకదానికొకటి ఢీకొన్నాయి.

Jharkhand: ఘోర రోడ్డు ప్రమాదం.. 16 మంది మృతి.. 26 మందికి గాయాలు

Jharkhand

Jharkhand: జార్ఖండ్‌లోని పాకుర్ జిల్లాలో బుధవారం ఉదయం ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న లారీ, ఎదురుగా వస్తున్న బస్సు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. వీరిలో16 మంది మరణించా 26 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. అమ్రపరా పోలీస్ స్టేషన్ పరిధిలోని పదేర్‌కోలా గ్రామం వద్ద గోవింద్‌పూర్-సాహెబ్‌గంజ్ రాష్ట్ర రహదారిపై ఉదయం 8.30 గంటలకు ప్రమాదం జరిగిందని వారు తెలిపారు. 40 మంది ప్రయాణికులతో బస్సు సాహిబ్‌గంజ్ జిల్లాలోని బర్హర్వా నుంచి దియోఘర్ జిల్లాలోని జసిదిహ్‌కు వెళుతున్నట్లు పోలీసులు వివరించారు.

చదవండి : Road Accident: జహీరాబాద్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం, చిన్నారి సహా నలుగురు మృతి

గాయపడిన 26 మందిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పాకుర్ ఆర్‌డి సివిల్ సర్జన్ పాశ్వాన్ మధ్యాహ్నం తెలిపారు. క్రిటికల్ పేషెంట్లలో ఒకరిని రాంచీలోని రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (RIMS)కి రెఫర్ చేశామని, మిగతా వారిని తరలించే ప్రక్రియ కొనసాగుతోందని సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (SDPO) అజిత్ కుమార్ విమల్ మీడియాకు వివరించారు. క్షతగాత్రులను తొలుత జిల్లాలోని సదర్ ఆసుపత్రిలో చేర్పించారు. చాలా మంది వ్యక్తులు బస్సులో చిక్కుకున్నారని, గ్యాస్ కట్టర్‌లతో వాహనాన్ని కట్ చేసి వారిని బయటకు తీసినట్లు పోలీసులు తెలిపారు.

చదవండి : Road Accident : న్యూ ఇయర్ చూడకుండానే నూరేళ్లు.. రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి

ఈ ప్రమాదంలో రెండు వాహనాల ముందుభాగాలు ఒకదానికొకటి ఇరుక్కుపోయాయి. బస్సు, లారీ రెండూ అతివేగంగా వెళ్లాయని, ప్రాంతంలో దట్టమైన పొగమంచు కారణంగా కనిపించకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. అతివేగమే ఇంతమందిని బలితీసుకుందని వివరించారు. అదృష్టవశాత్తూ ట్రక్కులో ఉన్న గ్యాస్ సిలిండర్ ఒక్కటి కూడా పేలలేదని, లేకుంటే ప్రాణనష్టం పెరిగేదని తెలిపారు. ఇక ఈ ఘటనపై జార్ఖండ్ ముఖ్యమంత్రి స్పందించారు. సీఎం హేమంత్ సోరెన్ సంతాపం తెలిపారు గాయపడిన వ్యక్తులకు సరైన చికిత్స అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.

చదవండి : Road Accident : ఔటర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం

మృతుల ఆత్మకు శాంతి చేకూర్చాలని, మృతుల కుటుంబాలకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని, క్షతగాత్రులకు తగు చికిత్స అందించాలని జిల్లా యంత్రాంగానికి తగు సూచనలు చేశామని తెలిపారు.