Narappa : వెంకటేష్ కనబడలేదు. ‘నారప్పే’ కనిపించాడు – చిరంజీవి..

మెగాస్టార్ చిరంజీవి ‘నారప్ప’ సినిమా చూసి, వెంకటేష్‌తో పాటు మూవీ టీంని అభినందించారు..

Narappa : వెంకటేష్ కనబడలేదు. ‘నారప్పే’ కనిపించాడు – చిరంజీవి..

Chiranjeevi Venkatesh

Narappa: హీరో వెంకటేష్ తన దశాబ్దాల సుదీర్ఘ సినీ కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ మూవీస్‌తో, క్లాస్, మాస్ హీరోగా, మహిళాభిమానుల ఆదరణతో విక్టరీని ఇంటిపేరుగా మార్చుకున్నారు. వెంక‌టేష్ హీరోగా మనసుకు హత్తుకునే ఆహ్లాదకరమైన చిత్రాలు చేసే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘నార‌ప్ప‌’. ధనుష్ నటించిన సూపర్ హిట్ తమిళ్ మూవీ ‘అసురన్’ కి తెలుగు రీమేక్ ఇది. సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మించారు.

Narappa : విక్టరీ వెంకటేష్ వన్‌మెన్ షో ‘నారప్ప’..

ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లు ఎప్పుడు పున:ప్రారంభమవుతాయో క్లారిటీ లేకపోవడంతో ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేశారు. ‘నారప్ప’ వెంకీ వన్ మెన్ షో అంటూ ప్రేక్షకులు, విమర్శకులు ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత వెంకీ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో అత్యద్భుతంగా నటించారు. చూసిన వారంతా.. రీమేక్ అయినా ఎక్కడా ఆ ఛాయలు కనబడకుండా శ్రీకాంత్ అడ్డాల చాలా చక్కగా తెరకెక్కించారంటున్నారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ‘నారప్ప’ సినిమా చూసి, వెంకటేష్‌తో పాటు మూవీ టీంని అభినందించారు. ఈ సందర్భంగా చిరు వాయిస్ క్లిప్‌ను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు వెంకటేష్.

‘‘కంగ్రాచ్యులేషన్స్.. నేను ఇప్పుడే ‘నారప్ప’ చూశాను. వావ్.. వాట్ ఎ పర్ఫార్మెన్స్.. వాట్ ఎ ట్రాన్సఫర్మేషన్.. నాకు ఎక్కడా వెంకటేష్ కనబడలేదు. నారప్పే కనిపించాడు. టోటల్‌గా కొత్త వెంకటేష్‌ను చూస్తున్నాన్నేను. క్యారెక్టర్‌ని ఎంతగానో అర్థం చేసుకుని, ఎంతో డెప్త్‌లోకి వెళ్లి నటించావ్ వెంకీ.. నీలో ఉండే నటుడు ఎప్పుడూ ఒక తపనతో, తాప్రతయంతో ఉంటాడు. అలాంటి వాటికి ఈ సినిమా ఒక మంచి ఉదాహరణ.. ‘నారప్ప’ మీ కెరీర్లో గర్వంగా చెప్పుకునే చిత్రం అవుతుంది’ అంటూ మెగాస్టార్, వెంకటేష్ అండ్ టీంని ప్రశంసించారు.