Megastar Chiranjeevi : మెస్మరైజింగ్ మెగా అప్‌డేట్.. చరణ్, శంకర్ సినిమాలో చిరు..
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కలిసి సిల్వర్ స్క్రీన్ మీద కనిపిస్తే మెగాభిమానులకు, సినీ ప్రియులకు ఏ రేంజ్ కిక్కు ఉంటుందో కొత్తగా చెప్పక్కర్లేదు.. చిరు- కొరటాల కలయికలో రాబోతున్న ‘ఆచార్య’ లో చెర్రీ ‘సిద్ధ’ క్యారెక్టర్ చేస్తున్నాడు కదా దాని గురించేనా? అనుకునేరు.. ఇది వేరు..

Megastar Chiranjeevi
Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కలిసి సిల్వర్ స్క్రీన్ మీద కనిపిస్తే మెగాభిమానులకు, సినీ ప్రియులకు ఏ రేంజ్ కిక్కు ఉంటుందో కొత్తగా చెప్పక్కర్లేదు.. చిరు- కొరటాల కలయికలో రాబోతున్న ‘ఆచార్య’ లో చెర్రీ ‘సిద్ధ’ క్యారెక్టర్ చేస్తున్నాడు కదా దాని గురించేనా? అనుకునేరు.. ఇది వేరు.. చరణ్ సెకండ్ సినిమా, ఇండస్ట్రీ హిట్ ‘మగధీర’ లో మొట్టమొదటి సారి ‘చిరుత’నయుడితో కలిసి తెర పంచుకున్నారు. తర్వాత ‘బ్రూస్ లీ’ లోనూ మెరిశారు. ‘ఖైదీ నెం:150’ లో స్టెప్టులతో ఇరగదీశారు. ఇప్పుడు ‘ఆచార్య’ లో కనిపించనున్నారు.
ఐదో సారి మెగా తండ్రి తనయులు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. సిల్వర్ స్ర్కీన్ సెల్యూలాయిడ్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కలయికలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దిల్ రాజుకి 50వ సినిమా కాగా చెర్రీకిది 15వ సినిమా. ఈ సినిమాలో మెగా స్టార్ గెస్ట్ అప్పీరియన్స్ ఇవ్వనున్నారు. చిరు-శంకర్ కాంబో పలుసార్లు వార్తల్లోకి వచ్చినా ఎందుకో సెట్ కాలేదు. కట్ చేస్తే ఇప్పుడు చిరు తనయుడు చరణ్, శంకర్‌తో సినిమా చేస్తున్నారు.
Ram charan : ‘ఆచార్య’ తో ‘సిద్ధ’.. మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్..
మెగాస్టార్ కాకపోయినా ఆయన నట వారసుడు చరణ్, శంకర్‌తో సినిమా చేస్తుండడంతో.. ఈ మూవీలో చిరు అతిథి పాత్రలో కనిపిస్తే ఆయన కోరిక తీరినట్లవుతోందని యూనిట్ భావిస్తోంది.
ఎందుకంటే ‘రోబో’ ఫంక్షన్‌లో స్వయంగా చిరునే నాతో సినిమా చెయ్యండని శంకర్‌ని అడిగారు.. కానీ వీలుపడలేదు.. ఇక ఇప్పుడు ఈ పాన్ ఇండియా సినిమాలో కనుక చిరు స్పెషల్ రోల్ చేస్తే.. ఆ రికార్డుల గురించి కొత్తగా చెప్పక్కర్లేదనుకుంటా.. సో మెగా ఫ్యాన్స్.. గెట్ రెడీ..
చిరు మిస్ అయినా చరణ్ ఛాన్స్ కొట్టేశాడు!