Chiranjeevi – Ajith : అప్పుడు అజిత్ ఫస్ట్ సినిమాను ఆశీర్వదించి.. ఇప్పుడు అజిత్ సినిమాని రీమేక్ చేసిన మెగాస్టార్..
అసలు అజిత్ ని తెలుగులో పరిచయం చేస్తూ ప్రమోట్ చేసిందే చిరంజీవి అనే విషయం చాలా మందికి తెలియదు.

Megastar Chiranjeevi wishesh Ajith Kumar First Telugu Movie Now Ajith Vedalam Remake as Bholaa Shankar
Chiranjeevi – Ajith : మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నేడు భోళా శంకర్(Bholaa Shankar) సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఇది తమిళ్ లో అజిత్ నటించిన వేదాళం(Vedalam) సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది. భోళా శంకర్ సినిమాపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. దీంతో కొంతమంది తమిళ్ అజిత్ ఫ్యాన్స్ అజిత్ లా చిరంజీవి మెప్పించలేకపోయాడని కామెంట్స్ చేస్తున్నారు.
అయితే అసలు అజిత్ ని తెలుగులో పరిచయం చేస్తూ ప్రమోట్ చేసిందే చిరంజీవి అనే విషయం చాలా మందికి తెలియదు. అజిత్ తమిళ్ లో ఒక సినిమా చేసి అనంతరం తెలుగులో తన మొదటి సినిమా ప్రేమ పుస్తకం(Prema Pusthakam) చేశారు. గొల్లపూడి మారుతీరావు తనయుడు గొల్లపూడి శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. కాంచన్ హీరోయిన్ గా నటించింది. 1993 లో రిలీజయిన ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి అప్పటికే మెగాస్టార్ గా ఉన్న చిరంజీవి వచ్చారు.
RGV : చిరంజీవికి ఆర్జీవీ మెగా కౌంటర్.. వాళ్ళని దూరం పెట్టకపోతే అంతే..
అజిత్ మొదటి తెలుగు సినిమా ప్రేమ పుస్తకం మంచి విజయం సాధించింది తెలుగులో. మెగాస్టార్ చిరంజీవి అప్పుడు అజిత్, కాంచన్ ని ఆశీర్వదించారు. ఇప్పుడు అదే మెగాస్టార్ అజిత్ నటించిన వేదాళం సినిమాని భోళా శంకర్ సినిమాగా రీమేక్ చేశారు.