ukraine: 1,000 మంది ఉన్న షాపింగ్ మాల్‌పై ర‌ష్యా క్షిప‌ణి దాడి

యుక్రెయిన్‌లో ర‌ష్యా దాడులు కొన‌సాగుతున్నాయి. జ‌నావాసాల‌ను కూడా ల‌క్ష్యంగా చేసుకుని ర‌ష్యా భీక‌ర దాడులు చేస్తోంది.

ukraine: 1,000 మంది ఉన్న షాపింగ్ మాల్‌పై ర‌ష్యా క్షిప‌ణి దాడి

Ukrain

ukraine: యుక్రెయిన్‌లో ర‌ష్యా దాడులు కొన‌సాగుతున్నాయి. జ‌నావాసాల‌ను కూడా ల‌క్ష్యంగా చేసుకుని ర‌ష్యా భీక‌ర దాడులు చేస్తోంది. త‌మ దేశంలోని క్రెమెన్‌చుక్ న‌గ‌రంలో ఇవాళ 1,000 మంది ఉన్న షాపింగ్ మాల్‌పై ర‌ష్యా క్షిప‌ణి దాడి చేసిందని యుక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్ స్కీ తెలిపారు. ఈ దాడిలో ఎంత మంది మృతి చెందార‌న్న విష‌యంపై ఆయ‌న వివ‌రాలు తెలప‌లేదు. ఎంత‌మంది మృతులు/క్ష‌త‌గాత్రులు ఉన్నార‌న్న విష‌యంపై అంచ‌నాకు రావ‌డం కూడా సాధ్య‌ప‌డ‌ద‌ని ఆయ‌న చెప్పారు.

Maharashtra: ఈ నెల 22నే సీఎం ప‌ద‌వికి రాజీనామా చేయాల‌నుకున్న ఉద్ధ‌వ్.. చివ‌ర‌కు..

ర‌ష్యా మాన‌వ‌తా దృక్ప‌థంతో వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని ఆశ‌లు పెట్టుకోవ‌డం కూడా నిరుప‌యోగ‌మేన‌ని ఆయ‌న టెలిగ్రాంలో రాసుకొచ్చారు. క్రెమెన్‌చుక్ న‌గ‌రంలో దాడి జ‌రిగింద‌ని న‌గ‌ర మేయ‌ర్ విట‌లీయ్ మెలెట‌స్కీ కూడా తెలిపారు. మృతుల సంఖ్య గురించి మాత్రం వివ‌రాలు తెల‌పలేదు. కాగా, కొన్ని నెల‌లుగా ర‌ష్యా-యుక్రెయిన్ యుద్ధం జ‌రుగుతోంది. ర‌ష్యా సేన‌ల‌ను యుక్రెయిన్ సేన‌లు అమెరికా స‌హా ప‌లు దేశాల సాంకేతిక‌, ఆయుధ సాయం వ‌ల్ల‌ నిలువ‌రిస్తున్నాయి.