Maharashtra: ఈ నెల 22నే సీఎం ప‌ద‌వికి రాజీనామా చేయాల‌నుకున్న ఉద్ధ‌వ్.. చివ‌ర‌కు..

శివ‌సేన నేత‌ల తిరుగుబాటు నేప‌థ్యంలో మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ ఠాక్రే ఈ నెల 22న సాయంత్రం 5 గంట‌ల‌కు సీఎం ప‌ద‌వికి రాజీనామా చేయాల‌నుకున్నార‌ని తెలిసింది.

Maharashtra: ఈ నెల 22నే సీఎం ప‌ద‌వికి రాజీనామా చేయాల‌నుకున్న ఉద్ధ‌వ్.. చివ‌ర‌కు..

Uddhav Thackeray

Maharashtra: శివ‌సేన నేత‌ల తిరుగుబాటు నేప‌థ్యంలో మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ ఠాక్రే ఈ నెల 22న సాయంత్రం 5 గంట‌ల‌కు సీఎం ప‌ద‌వికి రాజీనామా చేయాల‌నుకున్నార‌ని తెలిసింది. రాజ‌కీయ సంక్షోభం నుంచి గట్టెక్కే అవ‌కాశం లేక‌పోవ‌డంతో ఆయ‌న ఆ నిర్ణ‌యం తీసుకున్నార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు తెలిపాయి. అయితే, ఉద్ధ‌వ్ ఠాక్రే తీసుకున్న నిర్ణ‌యాన్ని విర‌మించుకోవాల‌ని మ‌హా వికాస్ అఘాడీ కీల‌క‌ నేత‌లు సూచించ‌డంతో ఆయ‌న వెన‌క్కి త‌గ్గారు.

Maharashtra Crisis: మ‌హారాష్ట్ర డిప్యూటీ స్పీక‌ర్‌, సర్కారుకు సుప్రీంకోర్టు నోటీసులు

ఈ నెల 22న సాయంత్రం 5 గంట‌ల‌కు శివ‌సేన వ్య‌వ‌స్థాప‌కుడు బాలాసాహెబ్ ఠాక్రే స్మార‌క చిహ్నం వ‌ద్దకు వెళ్ళి ఉద్ధ‌వ్ ఠాక్రే ప్ర‌సంగించాల‌నుకున్నారు. ఆ స‌మ‌యంలోనే రాజీనామా ప్ర‌క‌ట‌న చేయాల‌నుకున్నారు. అయితే, ఆ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకోవ‌డంతో ఆయ‌న ప్ర‌సంగం సాయ‌త్రం 5.30 గంట‌ల‌కు వాయిదా పడింది. అంతేకాదు, ఉద్ధ‌వ్ ఠాక్రే ఈ నెల 21న కూడా రాజీనామా చేయాల‌నుకుని, ఆ ప్ర‌ణాళిక‌లో మార్పులు చేసుకున్న‌ట్లు తెలిసింది. ఆ త‌దుప‌రి రోజు ఆయ‌న రాజీనామాకు సిద్ధ‌మ‌వ‌గా ప‌లువురు నేత‌ల సూచ‌న‌ల‌తో మ‌ళ్ళీ వెన‌క్కి త‌గ్గారు.