Mohanlal : వైరల్ అవుతున్న మోహన్ లాల్ వీడియో.. కామెంట్ చేసిన పృథ్వీరాజ్

చాలామంది సినీతారలు ఫిట్నెస్ పై ఎక్కవ దృష్టిపెడతారు. తమ జీవితంలో వ్యాయామం ఒక భాగం చేసుకుంటారు. నిత్యం జిమ్ కి వెళ్తూ వర్కౌట్స్ చేస్తుంటారు.

Mohanlal : వైరల్ అవుతున్న మోహన్ లాల్ వీడియో.. కామెంట్ చేసిన పృథ్వీరాజ్

Mohanlal

Mohanlal : సినిమా యాక్టర్లు తమ జీవితంలో వ్యాయామం, యోగాను ఒక భాగం చేసుకుంటారు. ఫిట్నెస్ తోపాటు మానసికంగా ప్రశాంతంగా ఉంటేనే వారు నటనను పండించగలం అని నమ్ముతారు. అందుకే ఉదయాన్నే జిమ్ లలో చెమటోడ్చుతారు. కొందరు ప్రత్యేక యోగ క్లాసులకు వెళ్తుంటారు. ఇక మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ క్రమం తప్పకుండ వ్యయం చేస్తుంటారు. ఇందుకు సంబందించిన వీడియోలను తన వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేస్తుంటారు. 61 ఏళ్ల వయసులో కూడా మోహన్ లాల్ ఏ మాత్రం తగ్గకుండా భారీ వరువులనే ఎత్తుతుంటారు. ఇక తాజాగా ఓ వీడియో షేర్ చేశారు.

 

View this post on Instagram

 

A post shared by Mohanlal (@mohanlal)

ఈ వీడియోలో బరువులు ఎత్తుతూ కనిపించారు మోహన్ లాల్.. ఇక ఈ వీడియోపై ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కామెంట్ చేశారు. మోహన్ లాల్ కృషిని అతడి అంకిత భావాన్ని ప్రశంశించారు. మోహన్ లాల్ ఇంటి దగ్గర ఉన్నప్పుడు జిమ్ లో ఎక్కువ సమయం గడుపుతాడని చెప్పుకొచ్చారు. మోహన్ లాల్ వ్యాయామం తన జీవితంలో భాగంగా చేసుకున్నారని తెలిపారు. మోహన్ లాల్ ఇంటికి వెళ్ళినప్పుడు ఎక్కువగా జిమ్ లోనే కనిపించేవారని వివరించారు.

 

View this post on Instagram

 

A post shared by Mohanlal (@mohanlal)

 

అయితే మోహన్ లాల్ వర్కౌట్ వీడియోలు షేర్ చేయడం ఇది మొదటిసారేం కాదు. చాలాసార్లు ఆయన ఈ వీడియోలను షేర్ చేశారు. కొన్ని ఫిట్నెస్ ట్రిక్స్ ని అభిమానులతో షేర్ చేసుకుంటారు. వ్యాయామం జీవితంలో ఒకభాగమని తన అభిమానులకు చెబుతుంటారు మోహన్ లాల్. తాజాగా మోహన్ లాల్ పోస్ట్ చేసిన వీడియోకి క్యాప్షన్‌ ఇస్తూ.. శరీరం మనసు రెండిటికి వ్యాయామం ఏంటో అవసరమని తెలిపారు.