Monkeypox: “ప్రాణాంతక వ్యాప్తిని అడ్డుకోవడానికి సిద్ధం కావాలి”

ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ మంకీపాక్స్ గురించి మాట్లాడారు. ఇదొక వేకప్ కాల్ లాంటిదని, ఎందుకంటే ప్రాణాంతక వ్యాప్తి జరగకుండా ఉండేందుకు మనల్ని మనం సిద్ధం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

Monkeypox: “ప్రాణాంతక వ్యాప్తిని అడ్డుకోవడానికి సిద్ధం కావాలి”

Monkeypox

 

 

Monkeypox: ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ మంకీపాక్స్ గురించి మాట్లాడారు. ఇదొక వేకప్ కాల్ లాంటిదని, ఎందుకంటే ప్రాణాంతక వ్యాప్తి జరగకుండా ఉండేందుకు మనల్ని మనం సిద్ధం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

1980 నుండి, మశూచి వ్యాక్సినేషన్ కార్యక్రమాలను నిలిపేశారు. ఇది వైరస్ ప్రపంచంలో మార్పులు చేయడానికి సహాయపడింది. డాక్టర్ స్వామినాథన్, అయితే, మంకీపాక్స్ కోసం మశూచి వ్యాక్సిన్‌ను ఉపయోగించడం ఉపయోగకరంగా ఉంటుందని సూచించింది.

“మశూచికి మన వద్ద ఉన్న టీకా, సెకండ్, థర్డ్ జనరేషన్ వ్యాక్సిన్‌లు. కానీ చాలా లిమిటెడ్ డోస్ లు మాత్రమే ఉన్నాయి. మశూచి వ్యాప్తి, జీవసంబంధమైన లేదా ప్రమాదవశాత్తూ సమస్యులుంటేనే దేశాలు ఈ వ్యాక్సిన్‌లను నిల్వ చేస్తున్నాయి” అని ఆమె చెప్పారు.

Read Also: హాస్పిటల్ నుంచి పారిపోయిన మంకీపాక్స్ తొలి రోగి

ప్రస్తుతమున్న మశూచి వ్యాక్సిన్ విస్తృతంగా అందుబాటులోకి వస్తే సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో సహా భారతీయ ఫార్మా కంపెనీలు బాట్లింగ్, మార్కెటింగ్ పంపిణీలో ముఖ్య పాత్రను కలిగి ఉంటాయని డాక్టర్ స్వామినాథన్ చెప్పారు.

కోవిడ్ కొత్త ఉత్పరివర్తన వైరస్ కంటే మంకీపాక్స్ అధ్వానంగా ఉంటుందా అంటే నేరుగా అలాగే ఉంటుందని చెప్పలేమని అన్నారు. డేటా లేనప్పటికీ Monkeypox వేరే వైరస్ అని, కోవిడ్ వలె అదే వేగంతో పరివర్తన చెందదని స్పష్టంగా తెలుస్తుంది.

భారతదేశంలో మంకీపాక్స్ కేసులు
ఇప్పటివరకు, భారతదేశంలో మంకీపాక్స్ నాలుగు కేసులు బయటపడ్డాయి — కేరళ నుండి మూడు మరియు ఢిల్లీ నుండి ఒకటి.

వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశంలోని పలు విమానాశ్రయాలు హెల్త్ స్క్రీనింగ్ చర్యలను ముమ్మరం చేశాయి. ఢిల్లీ విమానాశ్రయం వైరల్ ఇన్ఫెక్షన్ లక్షణాలను కనిపించిన వారిని లోక్ నాయక్ జై ప్రకాష్ (LNJP) ఆసుపత్రికి పంపుతున్నారు.