Moto G82 5G : మోటోరోలా నుంచి కొత్త 5G ఫోన్.. ఇండియాలో లాంచ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Moto G82 5G : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం మోటోరోలా నుంచి కొత్త 5G ఫోన్ వస్తోంది. భారత మార్కెట్లో Moto G82 జూన్ 7న లాంచ్ కానుంది.

Moto G82 5G : మోటోరోలా నుంచి కొత్త 5G ఫోన్.. ఇండియాలో లాంచ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Motorola Confirms India Launch Date For Moto G82 5g Check Out Expected Specs And Pricemotorola Confirms India Launch Date For Moto G82 5g Check Out Expected Specs And Price

Moto G82 5G : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం మోటోరోలా నుంచి కొత్త 5G ఫోన్ వస్తోంది. భారత మార్కెట్లో Moto G82 జూన్ 7న లాంచ్ కానుంది. ఈ మేరకు Motorola అధికారిక తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది.

లాంచ్‌కు ముందు కంపెనీ ఫోన్‌లోని కొన్ని కీలక ఫీచర్లను కూడా రిలీజ్ చేసింది. ఈ మోటో 5G ఫోన్ ఇప్పటికే యూరోపియన్ మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. రాబోయే Moto ఫోన్‌లో కొన్ని కీలక ఫీచర్లలో 120Hz 10-బిట్ పోలెడ్ డిస్‌ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా, 50-MP OIS ప్రైమరీ సెన్సార్‌తో వచ్చింది.

యూరప్‌లో, Moto G82 ప్రారంభ ధర EUR 329.99తో వచ్చింది. మన భారత కరెన్సీలో Moto G82  ధర దాదాపు రూ. 26,500 వరకు ఉండొచ్చు. కానీ, భారతీయ వేరియంట్ మోటో ఫోన్ ధర కొంచెం తక్కువగా ఉంటుందని అంచనా. 6GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్టులో స్పెషల్ పేజీలో లిస్టు అయింది. Moto G82 ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయొచ్చు. మెటోరైట్ గ్రే, వైట్ లిల్లీ వంటి రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

Motorola Confirms India Launch Date For Moto G82 5g Check Out Expected Specs And Pricemotorola Confirms India Launch Date For Moto G82 5g Check Out Expected Specs And Price (1)

Motorola Confirms India Launch Date For Moto G82 5g Check Out Expected Specs And Pricemotorola Confirms India Launch Date For Moto G82 5g Check Out Expected Specs And Price

Moto G82 5G : స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
ఈ 5G ఫోన్.. గ్లోబల్ మోడల్‌ పోలి ఉంటాయి.. యూరోపియన్ మార్కెట్‌లో, Moto G82  120Hz రిఫ్రెష్ రేట్ 360Hz టచ్ శాంప్లింగ్‌తో 6.6-అంగుళాల pOLED డిస్‌ప్లేతో వస్తుంది. పంచ్-హోల్ డిజైన్‌తో 10-బిట్ డిస్‌ప్లేను కలిగి ఉంది. NFCకి కూడా సపోర్టు చేస్తుంది. 5G చిప్ Qualcomm Snapdragon 695 SoC ఆధారంగా పనిచేస్తుంది. దీని హుడ్ కింద, 30W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000mAh బ్యాటరీని అందించారు. హ్యాండ్‌సెట్ IP52 రేటింగ్‌తో వచ్చింది. ఆడియో పరంగా డాల్బీ అట్మోస్‌కు సపోర్టు కలిగి ఉంది. స్టీరియో స్పీకర్‌లు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి.

కెమెరాల విషయానికి వస్తే.. Moto G82  ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుతో 50-MP ప్రైమరీ సెన్సార్ ఉంది. 8-MP అల్ట్రా-వైడ్ యాంగిల్ సెన్సార్, మాక్రో సెన్సార్‌తో వచ్చింది. సెల్ఫీలు, వీడియో కాల్‌ కోసం 16-MP సెన్సార్ ఉంది.

Read Also : Realme Pad X India : రియల్‌మి నుంచి Realme Pad X టాబ్లెట్ వస్తోంది.. ఎప్పుడంటే?