Motorola Edge 40 Pro : మోటోరోలా నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ధర, ఫీచర్లు లీక్..!

Motorola Edge 40 Pro : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం మోటోరోలా ఇటీవల చైనాలో Moto X40ని లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్‌ను గ్లోబల్ మార్కెట్లో లాంచ్ చేయాలని భావిస్తోంది.

Motorola Edge 40 Pro : మోటోరోలా నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ధర, ఫీచర్లు లీక్..!

Motorola Edge 40 Pro Price, Configuration, Colour Options Leaked Ahead of Global Launch

Motorola Edge 40 Pro : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం మోటోరోలా (Motorola) ఇటీవల చైనాలో Moto X40ని లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్‌ను గ్లోబల్ మార్కెట్లో లాంచ్ చేయాలని భావిస్తోంది. మోటరోలా ఎడ్జ్ 40 ప్రో (అమెరికాలో మోటరోలా ఎడ్జ్ + (2023) అని పిలుస్తారు. ఈ స్మార్ట్‌ఫోన్ ధర, కాన్ఫిగరేషన్, కలర్ వంటి వివరాలపై కొత్త నివేదిక వెల్లడించింది. ఈ ఫ్లాగ్‌షిప్ మోటరోలా ఎడ్జ్ 30 ప్రో అప్‌గ్రేడ్ వెర్షన్ అని చెప్పవచ్చు. ఫిబ్రవరి 2022లో భారత మార్కెట్లో లాంచ్ అయింది. మోటోరోలా Motorola Edge 40 Pro, Moto X40 మాదిరిగానే స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

మోటరోలా ఎడ్జ్ 40 Pro ధర (అంచనా) :
నివేదిక ప్రకారం.. Motorola Edge 40 Pro ప్రపంచవ్యాప్తంగా ఒకే 12GB RAM + 256GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌తో వస్తుంది. ఈ Motorola స్మార్ట్‌ఫోన్ ధర EUR 850 (దాదాపు రూ. 75వేలు ) ఉండవచ్చని అంచనా. బ్లాక్, బ్లూ కలర్ ఆప్షన్లలో వస్తుందని చెప్పవచ్చు. రీకాల్ చేసేందుకు Moto X40 మొత్తం నాలుగు కాన్ఫిగరేషన్‌లతో చైనాలో లాంచ్ అయింది.

Motorola Edge 40 Pro Price, Configuration, Colour Options Leaked Ahead of Global Launch

Motorola Edge 40 Pro Price, Configuration, Colour Options Leaked

Read Also : Motorola Edge 30 Fusion : మోటోరోలా ఎడ్జ్ 30 ఫ్యూజన్ వివా లిమిటెడ్ ఎడిషన్ వచ్చేసింది.. అదిరే ఫీచర్లు.. ధర ఎంతో తెలుసా?

మోటోరోలా Edge 40 Pro స్పెసిఫికేషన్‌లు (అంచనా) :
మోటో Edge 40 Pro, Moto X40 రీబ్యాడ్జ్ వెర్షన్ అని చెప్పవచ్చు. రాబోయే వేరియంట్‌కు సమానమైన స్పెసిఫికేషన్‌లను అందించే అవకాశం ఉంది. 165Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్టుతో 6.7-అంగుళాల Full-HD+ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ Motorola స్మార్ట్‌ఫోన్ Qualcomm లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్‌ను అందించవచ్చు. Moto X40 ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్‌తో 50-MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది.

కంపెనీ మోటరోలా Edge 40pro సెంట్రల్లీ-అలైన్డ్ హోల్-పంచ్ స్లాట్‌లో 60-MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంటుంది. 125W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 4,600mAh బ్యాటరీని అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 15W వైర్‌లెస్ ఛార్జింగ్, 15W రివర్స్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు అందిస్తుంది.

డ్యూయల్-సిమ్ 5G స్మార్ట్‌ఫోన్ కావచ్చు. Wi-Fi 6E, బ్లూటూత్ v5.3 వైర్‌లెస్ కనెక్టివిటీకి కూడా సపోర్టు ఇచ్చే అవకాశం ఉంది. Motorola Edge 40 Pro, Android 13-ఆధారిత MyUI 5.0పై రన్ కావచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ Moto X40 నుంచి 11-లేయర్ కూలింగ్ సిస్టమ్‌ను కూడా తీసుకోవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Motorola Jio 5G : మోటోరోలా ఫోన్లలోనూ జియో 5G అప్‌డేట్.. ఏయే స్మార్ట్‌ఫోన్లలో జియో ట్రూ 5G సపోర్టు చేస్తుందో తెలుసా? ఇదిగో ఫుల్ లిస్టు మీకోసం..!