MP Engineer : కోవిడ్ రోగుల కోసం, బైక్ ను అంబులెన్స్ గా మార్చిన వెల్డర్

మూడు కిలోమీటర్ల ప్రయాణానికి ఓ అంబులెన్స్ డ్రైవర్ ఏకంగా రూ. 10 వేలు వసూలు చేయడంపై ఓ వెల్డర్ ని కలిచివేసింది. కరోనా బాధితులకు అండగా నిలిచేందుకు తన బైక్ నే అంబులెన్స్ గా మార్చేశాడు.

MP Engineer : కోవిడ్ రోగుల కోసం, బైక్ ను అంబులెన్స్ గా మార్చిన వెల్డర్

Mp

Jugaad Ambulance : కరోనా సోకిన రోగుల పట్ల..పలువురు అనుచితంగా..దారుణంగా ప్రవర్తిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. వారిపట్ల వివక్ష చూపొద్దని సూచిస్తున్నా..కొంతమంది పెడచెవిన పెడుతున్నారు. ప్రధానంగా అంబులెన్స్ లు లేకపోవడంతో..చాలా మంది సొంత వాహనాలు మృతదేహాలను, కరోనా రోగులను తరలిస్తున్న ఘటనలు అందర్నీ కలిచివేస్తున్నాయి.

సోషల్ మీడియా వేదికగా పలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. కష్టకాలంలో బాధితులు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే..గిదేం దందా..అని తిట్టుకుంటుంటాం. మూడు కిలోమీటర్ల ప్రయాణానికి ఓ అంబులెన్స్ డ్రైవర్ ఏకంగా రూ. 10 వేలు వసూలు చేయడంపై ఓ వెల్డర్ ని కలిచివేసింది. కరోనా బాధితులకు అండగా నిలిచేందుకు తన బైక్ నే అంబులెన్స్ గా మార్చేశాడు.

మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ వెల్డర్ పేపర్లు, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను చదివే అలవాటు ఉంది. ఎప్పటిలాగే ఫేస్‌ బుక్‌లో ఓ అంబులెన్స్ డ్రైవర్ కరోనా బాధితుల నుంచి కేవలం 3 కిలోమీటర్లకు రూ.10 వేలు వసూలు చేస్తున్నాడనే వార్త ఆయన్ను కదిలించింది. కరోనా రోగులను ఆదుకోవాలని అనిపించింది. ఏం చేయాలి ? అని ఆలోచించాడు.

తన బైక్ ను అంబులెన్స్ గా ఎందుకు మార్చుకోవద్దు ? అని ఆలోచించాడు. స్వతహాగా వెల్డర్ కావడంతో..బైక్ ను సూపర్ అంబులెన్స్ గా మార్చివేశాడు. రూ. 20 నుంచి 25 వేలు ఖర్చు పెట్టాడు. ఈ మినీ అంబులెన్స్ లో ఆక్సిజన్ సిలిండర్ తో పాటు…కరోనా బాధితులకు మెడిసిన్ అందించేలా సెటప్ చేశాడు. కరోనా బాధితుడితో పాటు..మరో ఇద్దరు వ్యక్తులు ఇందులో కూర్చొనేలా డిజైన్ చేయడం విశేషం.

కరోనా వల్ల సామాన్యులు ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నారు. అంబులెన్స్‌లో కిలోమీటర్‌ దూరానికే వేలల్లో వసూలు చేయడం తనను ఎంతగానో బాధించింది. అందుకే కరోనా బాధితులకోసం స్క్రాప్‌ను ఉపయోగించి అంబులెన్స్‌ను తయారు చేసినట్లు అతను వెల్లడించాడు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Read More : ప్రైవేట్ ఆసుపత్రులకు వ్యాక్సిన్‌లు నిలిపివేత