పట్టించేసిన పాట : రెంట్ ఇస్తామని పట్టుకెళ్లి కెమెరాలతో..

  • Published By: nagamani ,Published On : December 9, 2020 / 04:00 PM IST
పట్టించేసిన పాట : రెంట్ ఇస్తామని పట్టుకెళ్లి కెమెరాలతో..

Mumbai yong mans stealing cameras to shoot songs : డిజిటల్ కెమెరాలు చోరీ చేశారనే కారణంతో ఇద్దరు యువకుల్ని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. పాటలు షూట్ చేస్తామని చెప్పిన ఆ ఇద్దరు యువకులు షాపులో రెండు కెమెరాలు అద్దెకు తీసుకున్నారు. రోజుకు ఒక్కో కెమెరాలకు రూ.1000లు అద్దె ఇస్తామని చెప్పి రెండు డిజిటల్ కెమెరాలను పట్టుకెళ్లారు. ఆ కెమెరాలు ఇచ్చేముందు షాపు యజమాని వారి అడ్రస్సులు, ఫోన్ నంబర్లు తీసుకున్నాడు.



కానీ అద్దెకని పట్టుకెళ్లి ఎన్ని రోజులు గడిచినా సదరు యువకులు శివకుమార్ శర్మ, సాదిక అన్సారీలకు కెమెరాలు పట్టుకురాకపోవటంతో ఆ షాపు యజమాని కునాల్ కంజియాకు అనుమానం వచ్చింది. దీంతో పోలీసులు ఫిర్యాదు చేశాడు. కానీ..వారి నుంచి ఎటువంటి స్పందనా లేదు.



పదే పదే ఫోన్ చేసినా శివకుమార్ శర్మ, సాదిక అన్సారీల నుంచి సమాధానం లేదు.దీంతో కునాల్ వాళ్లు ఇచ్చిన అడ్రస్ కు వెళ్లి విచారించగా అటువంటి వ్యక్తులెవ్వరూ ఇక్కడ లేదని తెలిసింది. దీంతో కునాల్ మోసపోయానని గ్రహించాడు.



అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను కెమెరాలు అద్దెకు ఇచ్చిన వారి గురించి వారు ఇచ్చిన ఫోన్ నంబర్లు, అడ్రస్సులు తప్ప మరేమీ తెలీదనీ..వాళ్ల గాయకులమని చెప్పారనీ..పాటలు పాడి వాటిని షూట్ చేసి యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తామని తెలిపారని చెప్పాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సదరు ఇద్దరి కోసం గాలింపు ప్రారంభించారు.కానీ నెల రోజులు గడిచినా వారి జాడ తెలియలేదు. దీంతో మరింత లోతుగా వారి కోసం గాలించగా..యూట్యూబ్ లో వారి కోసం పలు వీడియోలు చూశారు.



చివరకు ‘తు వాపాస్ ఆజా’అనే పాట వీడియో ద్వారా వారిని శివకుమార్ శర్మ, సాదిక అన్సారీలుగా గుర్తించారు. అనంతరం వారిని పట్టుకోవటానికి సీనియర్ ఇన్సప్పెక్టర్ నూతాన్ పవార్ నేతృత్వంలో బృందం దర్యాప్తు ప్రారంభించింది. అలా ఫిల్మ్ సిటీ ఎంట్రన్స్ వద్ద ఏర్పాటు చేసి ఉన్న సీసీ టీవీ పుటేజ్ ద్వారా వారి జాడ తెలుసుకుని వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు.అనంతరం వారి నుంచి రూ.40వేలు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదుచేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.