Mahit Narayan : చిరుపై చక్రి తమ్ముడి అభిమానం..

మ్యూజిక్ డైరెక్టర్ దివంగత చక్రి సోదరుడు మహిత్ నారాయణ్.. మెగాస్టార్ చిరంజీవిపై అద్భుతమైన సాంగ్ కంపోజ్ చేశారు..

Mahit Narayan : చిరుపై చక్రి తమ్ముడి అభిమానం..

Mahit Narayan

Mahit Narayan: మెగాస్టార్ చిరంజీవిని అమితంగా ఇష్టపడే సంగీత దర్శకుడు మహిత్ నారాయణ్ తన అభిమాన హీరో పుట్టినరోజుని పురస్కరించుకొని ” ‘‘చిరు కానుక’’ అనే పాటని రూపొందించారు. బాలాజీ ఈ పాటకు సాహిత్యం అందించగా ప్రముఖ నేపథ్య గాయకుడు కైలాష్ ఖేర్ ఆలపించడం విశేషం. మహిత్ నారాయణ్ సంగీతం అందించిన ‘‘చిరు కానుక’’ పాటని Magic Axis అదినేత్రి రోష్ని నాడియాల్ నిర్మించారు.

Chiranjeevi : ‘స్వయంకృషి’ కి ‘చిరు’నామా.. మెుగల్తూరు నుండి మెగాస్టార్ వరకు..

మెగాస్టార్ చిరంజీవి సేవా కార్యక్రమాల గురించి, చిరు ఆశయాల గురించి సాగే ఈ పాటని దర్శకుడు బాబీ విడుదల చేశారు. హైదరాబాద్‌లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో ఈ కార్యక్రమం జరిగింది. దర్శకుడు బాబీతో పాటుగా సంగీత దర్శకుడు మహిత్ నారాయణ్, నిర్మాత రోష్ని నాడియాల్, స్వామి నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Happy Birthday Chiranjeevi : బాస్ బర్త్‌డే.. ‘మెగా’ విషెస్..

ఈ సందర్బంగా సంగీత దర్శకుడు మహిత్ నారాయణ్ మాట్లాడుతూ.. ‘‘రామ్ చరణ్ బర్త్‌డేకి ఓ పాటని రూపొందించాను. ఆ పాట చిరంజీవి గారికి బాగా నచ్చింది. దాంతో ప్రత్యేకంగా ఫోన్ చేసి అభినందించారు. చిరంజీవి గారి ప్రోత్సాహం నాలో సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇక ఇప్పుడేమో అన్నయ్య చిరంజీవి పుట్టినరోజు కావడంతో ‘‘చిరు కానుక’’ అనే పాట చేశాం. Magic Axis అధినేత్రి రోష్ని గారు నిర్మించడానికి ముందుకు వచ్చారు. రోష్ని గారు అభిరుచి గల నిర్మాత.. మంచి చిత్రాలు నిర్మించాలనే లక్ష్యంతో ఉన్నారు. ఇక ఈ పాట కూడా చిరంజీవి గారిని అమితంగా అలరిస్తుందన్న నమ్మకం ఉంది. మా పాట రిలీజ్ చేసిన దర్శకుడు బాబీ గారికి, అలాగే స్వామి నాయుడు గారికి కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాను’’ అన్నారు.

Mahit Narayan

 

నిర్మాత రోష్ని మాట్లాడుతూ.. ‘‘మహిత్ గారు వినిపించిన పాట నచ్చడంతో.. మెగాస్టార్ గారి కోసం ఏదైనా చేయాలని ఆలోచిస్తున్న సమయంలో ఇదొక మంచి అవకాశంగా భావించి ఈ పాట రూపొందించడం జరిగింది. మా బ్యానర్‌లో మంచి అభిరుచి గల చిత్రాలను నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని చెప్పారు.

Niharika Konidela : ఇంత లెంగ్త్ ఉన్నాడేంటి.. నిహారిక పక్కన ఉంది ఎవరంటే..!