Chiranjeevi : ‘స్వయంకృషి’ కి ‘చిరు’నామా.. మెుగల్తూరు నుండి మెగాస్టార్ వరకు..

సిల్వర్ స్క్రీన్ మీద ఆయన కనబడితే ఫ్యాన్స్, ఆడియెన్స్.. విజిల్స్, క్లాప్స్‌తో థియేటర్లు దద్దరిల్లిపోతాయ్..

Chiranjeevi : ‘స్వయంకృషి’ కి ‘చిరు’నామా.. మెుగల్తూరు నుండి మెగాస్టార్ వరకు..

Chiru

Chiranjeevi: స్టార్.. స్టార్.. మెగాస్టార్.. స్టార్.. స్టార్.. సిల్వర్ స్క్రీన్ మీద ఆయన కనబడితే ఫ్యాన్స్, ఆడియెన్స్ విజిల్స్, క్లాప్స్‌తో థియేటర్లు దద్దరిల్లిపోతాయ్.. ఆయన కాలు కదిపితే పూలు, పేపర్లతో తెర నిండిపోతుంది. మాస్‌గా డైలాగ్ చెప్పినా, తన స్టైల్ మేనరిజమ్స్ చూపించినా.. ప్రేక్షకులు ముచ్చట పడిపోతారు. ఆయనే మన మెగాస్టార్ చిరంజీవి.

Chiru

చిరంజీవి బాల్యం.. విద్యాభ్యాసం..
1955 ఆగస్టు 22న మెగల్తూరులో కొణిదెల వెంకట్రావు, అంజనా దేవి దంపతులకు ప్రథమ సంతానంగా కొణిదెల శివ శంకర వరప్రసాద్ జన్మించారు. తండ్రి పోలీస్ కానిస్టేబుల్ కావడం వలన తరచూ ఉదో ఒక ప్రాంతానికి బదిలీ అవుతూ ఉండేది. చిరు తన బాల్యంలో కొంతకాలం తాతయ్య దర్గర ఉన్నారు. నిడుదలవోలు, బాపట్ల, గురజాల, పొన్నూరు, మంగళగిరి వంటి ఊళ్లలో ఆయన చదువుకున్నారు. ఒంగోలులోని సి.ఎస్.ఆర్. శర్మ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. నరసాపురంలోని వై.ఎన్. కాలేజీలో కామర్స్‌లో డిగ్రీ పట్టా పుచ్చుపుకున్నారు. 1970 లో ఎన్.సి.సి లో చేరి న్యూఢిల్లీలో జరిగిన పరేడ్‌‌లో పాల్గొన్నారు.

Chiranjeevi Childhood

నటనకు బీజం..
చిరుకి చిన్ననాటి నుండి నటన మీద ఆసక్తి ఉండేది. దీంతో ఎలాగైనా నటుడవ్వాలని ఫిక్స్ అయ్యారు. డిగ్రీ అనంతరం 1976 లో చెన్నై చేరుకున్నారు. అక్కడ మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరారు. అక్కడ నటనలో డిప్లోమా పొందిన తర్వాత నటుడిగా ప్రయత్నాలు ప్రారంభించారు.

Chiru Punadirallu

తొలిసారి కెమెరా ముందుకు..
నిర్మాత జయకృష్ణ, చిరంజీవికి మొట్టమొదటి సారిగా ‘పునాది రాళ్లు’ సినిమాలో అవకాశమిచ్చారు. పారితోషికంగా వెయ్యి నూట పదహార్లు అందుకున్నారు మెగాస్టార్. ఫస్ట్ సినిమా ‘పునాది రాళ్లు’ అయినా.. మొదట విడుదలైంది మాత్రం ‘ప్రాణం ఖరీదు’. ‘మనఊరి పాండవులు’ సినిమా నటుడిగా గుర్తింపు తెచ్చింది.

Mana Voori Pandavulu

విలన్ వేషాలు..
‘తాయారమ్మ బంగారయ్య’ లో ఓ చిన్న వేషం వేసిన తర్వాత.. ‘ఐ లవ్ యు’ అనే మూవీలో నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేశారు. కె. బాలచందర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా వచ్చిన ‘ఇది కథ కాదు’ లో విలన్‌గా కనిపించారు. ‘పున్నమినాగు’ లోనూ నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో కనిపించారు. ‘మోసగాడు’, ‘రాణీ కాసుల రంగమ్మ’, ‘47 రోజులు’, ‘న్యాయం కావాలి’ వంటి సినిమాల్లోనూ చిన్న చిన్న పాత్రలు వేశారు.

Punnami Nagu

సోలో కథానాయకుడిగా..
1982 లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ సినిమాతో చిరంజీవి హీరోగా నటించడం మొదలు పెట్టారు. ఈ సినిమా హిట్ అవడంతో ఆయన పేరు అందరికీ తెలిసింది. కె. విశ్వనాథ్ దర్శకత్వంలో నటించిన ‘శుభలేఖ’ సినిమాలోని నటనకు గాను చిరంజీవికి ఉత్తమ నటుడిగా తెలుగు ఫిలిం ఫేర్ అవార్డ్ అందుకున్నారు. 1983లో ఎ.కోదండరామి రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘ఖైదీ’ సినిమా బాక్సాఫీసు వద్ద ఘనవిజయం సాధించి చిరంజీవికి స్టార్ డమ్ సాధించి పెట్టింది. దీంతో చిరు పేరు మార్మోగిపోయింది. తర్వాత ‘ఇది పెళ్ళంటారా’, ‘సీతాదేవి’, ‘టింగురంగడు’, ‘బంధాలు అనుబంధాలు’, ‘మొండిఘటం’ వంటి చిత్రాల్లో నటించారు. ‘పట్నం వచ్చిన పతివ్రతలు’, ‘బిల్లా రంగా’, ‘మంచు పల్లకీ’ లాంటి మల్టీ స్టారర్ సినిమాలు చేశారు.

Intlo Ramayya Veedilo Krishnayya

తిరుగులేని సుప్రీం హీరో..
తర్వాత ‘మంత్రిగారి వియ్యంకుడు’, ‘సంఘర్షణ’, ‘గూండా’, ‘ఛాలెంజ్’, ‘హీరో’,‘ దొంగ’, ‘జ్వాల’, ‘అడవి దొంగ’, ‘కొండవీటి రాజా’, ‘రాక్షసుడు’ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. 1985 లో చిరంజీవికి విజేత సినిమాలో నటనకు రెండవసారి ఫిలిం ఫేర్ పురస్కారం అందుకున్నారు. 1986లో జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ‘చంటబ్బాయి’ సినిమాలో కామెడీ క్యారెక్టర్‌లో చిరు పండించిన హాస్యాన్ని అంత త్వరగా మర్చిపోలేం.

Megastar

బాక్సాఫీస్‌ని షేక్ చేసిన మెగస్టార్..
1987 లో కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘స్వయంకృషి’ సినిమాతో చిరంజీవి మొట్టమొదటి సారి ఉత్తమ నటుడిగా నంది పురస్కారం అందుకున్నారు. ‘పసివాడి ప్రాణం’, ‘యముడికి మొగుడు’, ‘మంచిదొంగ’ సినిమాలతో తెలుగు ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ‘పసివాడి ప్రాణం’ ద్వారా తెలుగు చిత్రపరిశ్రమకు బ్రేక్ డ్యాన్స్‌ను పరిచయం చేసిన ఘనత చిరుదే. సోషల్ కాజ్ గురించి తీసిన ‘రుద్రవీణ’ ఉత్తమ చిత్రంగా జాతీయ పురస్కారం, నంది స్పెషల్ జ్యూరీ పురస్కారం అందుకుంది.

Chiru Award

ట్రెండ్ సెట్టర్..
1990లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చినసోషియో ఫాంటసీ చిత్రం ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ ట్రెండ్ సెట్ చేసింది. అప్పట్లో వరదల్లోనూ బాక్సాఫీస్ వద్దు కలెక్షన్ల వరద పారించిందీ చిత్రం. ‘కొండవీటి దొంగ’ 70mm, 6-ట్రాక్ స్టీరియోఫోనిక్ సౌండ్‌లో విడుదలైన మొట్టమొదటి తెలుగు సినిమాగా చరిత్ర సృష్టించింది.
1991 లో వచ్చిన ‘కొదమ సింహం’, ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలు చిరంజీవిని తెలుగు చిత్రపరిశ్రమలో సుస్థిరమైన స్థానాన్ని సాధించిపెట్టాయి.
‘కొదమ సింహం’ సినిమా ఇంగ్లీష్‌లో ‘థీఫ్ ఆఫ్ బాగ్దాద్’ పేరుతో డబ్ అయ్యి.. నార్త్ అమెరికా, మెక్సికో, ఇరాన్ వంటి దేశాల్లో విజయవంతంగా ప్రదర్శింపబడింది. ఇది ఇంగ్లీష్‌లో డబ్ అయిన మొట్టమొదటి దక్షిణ భారత చలనచిత్రం.

Chiru

క్రేజ్ కొండెక్కి కూర్చుంది..
టాలీవుడ్ నుండి చిరు బాలీవుడ్ వెళ్లి నటించిన ‘ప్రతిబంధ్’, ‘ఆజ్ కా గూండా రాజ్’ సినిమాలు అక్కడ ఆయనకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. 1996 లో ‘సిపాయి’ అనే కన్నడ సినిమాలో అతిథి పాత్ర పోషించారు చిరంజీవి. ‘ఆపద్బాంధవుడు’ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా రెండో సారి నంది పురస్కారం, ఫిలిం ఫేర్ తెలుగు అవార్డు అందుకున్నారు. చిరు నటించిన సూపర్ హిట్ చిత్రం ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’.. తమిళనాట ‘మాప్పిళై’ పేరుతో రీమేక్ అయింది. ఇందులో రజినీ కాంత్ కథానాయకుడిగా నటించారు. చిరంజీవి అతిథి పాత్రలో కనిపించారు. చిరంజీవికి నాలుగోసారి ఫిల్మ్ ఫేర్ సాధించి పెట్టిన సినిమా ‘ముఠామేస్త్రి’.. ‘హిట్లర్’, ‘మాస్టర్’, ‘బావగారూ బాగున్నారా’, ‘చూడాలని వుంది’, ‘స్నేహం కోసం’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించాయి. ‘స్నేహం కోసం’ చిత్రంలో నటనకు గాను ఐదోసారి ఫిలిం ఫేర్ పురస్కారం అందుకున్నారు.

Aaj Ka Goonda Raj

రికార్డుల రారాజు..
‘ఇంద్ర’ సినిమా అప్పటి వరకు ఉన్న టాలీవుడ్ రికార్డులు తిరగరాసింది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ చిత్రంతో చిరంజీవికి ఉత్తమ నటుడిగా మూడోసారి నంది పురస్కారం, ఆరోసారి ఫిలిం ఫేర్ పురస్కారాలు అందాయి. ‘ఠాగూర్’ సినిమా చిరంజీవిని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లింది. ‘శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్.’ లో తన స్టైల్ కామెడీతో ఆకట్టుకున్నారు. ఈ సినిమాకు గాను ఉత్తమ నటుడిగా ఏడోసారి ఫిలిం ఫేర్ పురస్కారం అందుకున్నారు. ‘స్టాలిన్’ సొసైటీలో మార్పు తీసుకొచ్చిన చిత్రంగా గుర్తుండిపోతుంది. 2006 లో చిరంజీవికి సినీ రంగంలో చేసిన సేవలకు గాను పద్మభూషణ్ పురస్కారం లభించింది. ‘శంకర్ దాదా జిందాబాద్’ తర్వాత చిరు సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Chiranjeevi

రాజకీయాల్లోకి..
ప్రజల్లో చైతన్యం, రాజకీయాల్లో మార్పు తీసుకు రావాలని, తెలుగు ప్రజల కోరిక మేరకు ‘ప్రజారాజ్యం’ పార్టీ ఏర్పాటు చేసి.. రాజకీయాల్లోనూ సంచలనం సృష్టించారు. పర్యాటక శాఖా మంత్రి గానూ సేవలందించారు. పాలిటిక్స్ కారణంగా ప్రేక్షకులకు దూరమయ్యారు. రామ్ చరణ్ ‘మగధీర’, ‘బ్రూస్ లీ’ సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేసి ఫ్యాన్స్ అండ్ ఆడియెన్స్‌ను పలకరించారు.

Prajarajyam

రీ ఎంట్రీ.. అదే ఈజ్.. అదే గ్రేస్..
దాదాపు 10 ఏళ్ల తర్వాత ‘ఖైదీ నంబర్ 150’ తో హీరోగా రీ ఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్. జస్ట్ టైం గ్యాప్ అంతే అన్నట్లు రికార్డ్ స్థాయి కలెక్షన్లతో సెన్సేషన్ క్రియేట్ చేశారు. డ్యాన్స్ మూమెంట్స్‌తో రచ్చ చేశారు.. 60 + లోనూ యువకుడిలా కనిపించారు. తర్వాత కొడుకు రామ్ చరణ్ నిర్మాణంలో.. హిస్టారికల్ ఫిలిం ‘సైరా’ నరసింహా రెడ్డి తో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటారు. ఇప్పుడు చెర్రీతో ‘ఆచార్య’ చేస్తున్నారు. అది పూర్తవకముందే ‘లూసీఫర్’ రీమేక్ స్టార్ట్ చేసేశారు. తర్వాత బాబీ, మెహర్ రమేష్ వంటి యువ దర్శకులతో సినిమాలు లైన్లో పెట్టేశారు. చిరు స్పీడ్ చూసి, అభిమానులు, ప్రేక్షకులు, ఇండస్ట్రీ వర్గాల వారు ఆశ్చర్యపోతున్నారు.

Boss Is Back

Chiranjeevi : మెగాస్టార్ స్పీడ్ మామూలుగా లేదుగా..!