Naga Chaitanya: చైతూ రేర్ ఫీట్.. అతికొద్ది మందిలో ఒక్కడు!

కెరీర్ తొలి రోజుల్లో కాస్త తడబడినా ఇండస్ట్రీలో ఉన్న హీరోలలో సక్సెస్ ఫార్ములాను పట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడు నాగచైతన్య. హీరోయిజం, స్టార్డమ్, పాన్ ఇండియా లాంటి వాటి జోలికి పోకుండా..

Naga Chaitanya: చైతూ రేర్ ఫీట్.. అతికొద్ది మందిలో ఒక్కడు!

Naga Chaitanya

Updated On : March 22, 2022 / 2:46 PM IST

Naga Chaitanya: కెరీర్ తొలి రోజుల్లో కాస్త తడబడినా ఇండస్ట్రీలో ఉన్న హీరోలలో సక్సెస్ ఫార్ములాను పట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడు నాగచైతన్య. హీరోయిజం, స్టార్డమ్, పాన్ ఇండియా లాంటి వాటి జోలికి పోకుండా లవ్ స్టోరీస్ తోనే సక్సెస్ కొడుతున్నాడు నాగచైతన్య. ఫ్యామిలీ పరంగా కాస్త డిస్టర్బ్ అయినా.. ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంతా నుండి దూరం కావాల్సి వచ్చినా.. ఎక్కడా హడావుడి లేకుండా సెటిల్డ్ గా ఆలోచిస్తూ.. పరిస్థితులను అధిగమించి కెరీర్ పరంగా సక్సెస్ ట్రాక్ లో దూసుకెళ్తున్నాడు.

Naga Chaitanya : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన చైతూ.. కంగ్రాట్స్ బావ అంటూ వెంకీ కూతురి రిప్లై..

ఈ ఏడాది సంక్రాంతికి తండ్రితో కలిసి బంగార్రాజుగా హిట్టు కొట్టిన చైతూ ఇప్పుడు హిందీలో లాల్ సింగ్ చద్దాతో పాటు.. తెలుగు సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నాగచైతన్య త్రి షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించనున్న ఈ సినిమాను జోష్ తో తన సినిమా ప్రయాణాన్ని మొదలు పెట్టించిన దిల్ రాజు ఈ సినిమా నిర్మిస్తున్నారు. కాగా.. చైతన్య మరోవైపు వెబ్ సిరీస్ దూతతో డిజిటల్ ఎంట్రీ కూడా ఇస్తున్న చైతూ సోషల్ మీడియాలో కూడా భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నాడు.

Naga Chaitanya : విక్రమ్ దర్శకత్వంలో ‘దూత’గా భయపెట్టనున్న నాగచైతన్య

ప్రముఖ సోషల్ మీడియా యాప్ ఇన్ స్టాగ్రామ్ లో చైతూ మైల్ స్టోన్ టచ్ చేశాడు. ఇన్ స్టాలో 7 మిలియన్ ఫాలోవర్ల క్లబ్ లోకి చైతూ చేరుకున్నాడు. మన టాలీవుడ్ హీరోలలో 7 మిలియన్ ఫాలోవర్స్ కలిగిన అతి తక్కువమంది సెలెబ్రెటీస్ లో చైతూ ఒకడిగా నిలిచాడు. ఎన్టీఆర్ (3.6M), రామ్ చరణ్ (5.3M) లాంటి స్టార్లకు కూడా ఇన్ స్టాలో లేని ఫాలోయింగ్ ఇప్పుడు చైతూ సొంతం చేసుకున్నాడు. ఇన్ స్టా మాత్రమే కాదు.. మిగతా సోషల్ మీడియా యాప్స్ లో కూడా చైతూ భారీగా దూసుకుపోతున్నాడు.