‘లవ్ యూ నిహారిక’.. నాగబాబు భావోద్వేగం..

  • Published By: sekhar ,Published On : December 7, 2020 / 12:24 PM IST
‘లవ్ యూ నిహారిక’.. నాగబాబు భావోద్వేగం..

Nagababu Emotional Post: మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల మరికొద్ది గంటల్లో జొన్నలగడ్డ వెంకట చైతన్యను వివాహం చేసుకోబోతోంది. డిసెంబర్9, బుధవారం రాత్రి 7:15 నిమిషాలకు మిథున లగ్నంలో వీరి పెళ్లి జరుగనుంది. ఆ తర్వాత డిసెంబర్ 11, శుక్రవారం నాడు హైదరాబాద్, జెఆర్సీ కన్వెన్షన్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు.


Niharika Saree

నిహారిక పెళ్లి చేసుకుని మరో మెట్టినింట అడుగుపెట్టబోతున్న సందర్భంగా తండ్రి నాగబాబు భావోద్వేగానికి గురయ్యారు. నిహారికను పెళ్లి కూతుర్ని చేసిన సమయంలో అన్నయ్య చిరంజీవి, వదిన సురేఖలతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. నిహారికను ఉద్దేశించి ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు.

Chiru - Niharika

‘‘కుటుంబంగా నీకు మూలాలు అందించాం.. తండ్రిగా నువ్వు ఎగరడానికి కావలసిన రెక్కలు నీకిచ్చాను.. ఆ రెక్కలు నిన్ను మరింత ఎత్తుకు తీసుకెళ్తాయి.. అలాగే మా మూలాలు ఎప్పుడూ నిన్ను సేఫ్‌‌గా ఉంచుతాయి.. నిన్ను ప్రేమించే తండ్రిగా నీకు అందించే రెండు అద్భుతమైన బహుమతులు ఇవే.. లవ్ యూ నిహారిక..’’ అంటూ నాగబాబు ఎమోషనల్ అయ్యారు.


ఈ వేడుక కోసం తల్లి పద్మ నిశ్చితార్థపు చీరను నిహారిక కట్టుకోవడం విశేషం.. పెదనాన్న చిరంజీవితో తీసుకున్న సెల్ఫీతో పాటుగా ఈ ఫంక్షన్‌కు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మెగా ఫ్యాన్స్, ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి.