సిగ్గా? చక్కిలిగిలా?!కరోనా టీకా వేస్తున్న నర్సు..నవ్వుతూ..మెలికలు తిరిగిపోతున్న కానిస్టేబుల్!

నాగాలాండ్‌లోని ఒక వ్యాక్సినేషన్ సెంటర్‌ లో ఓ నర్సు ఓ కానిస్టేబుల్ కు వ్యాక్సిన్ వేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన వారు తెగ నవ్వేసుకుంటున్నారు. ఏంటీ సిగ్గా?భయమా? లేక చక్కిలిగిలా? ఎందుకలా మెలికలు తిరిగిపోతున్నాడు? అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

సిగ్గా? చక్కిలిగిలా?!కరోనా టీకా వేస్తున్న నర్సు..నవ్వుతూ..మెలికలు తిరిగిపోతున్న కానిస్టేబుల్!

Nagaland police laughing taking covid vaccine : దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోను కరోనా వ్యాక్సినేషన్ రెండవ దశ కొనసాగుతోంది. ఈ క్రమంలో నాగాలాండ్‌లోని ఒక వ్యాక్సినేషన్ సెంటర్‌ లో ఓ నర్సు ఓ కానిస్టేబుల్ కు వ్యాక్సిన్ వేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన వారు తెగ నవ్వేసుకుంటున్నారు. ఏంటీ సిగ్గా?భయమా? లేక చక్కిలిగిలా? ఎందుకలా మెలికలు తిరిగిపోతున్నాడు? అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ఈ వీడియోలో ఒక పోలీసు కరోనా టీకా వేసే కేంద్రానికి వచ్చాడు. అతనికి టీకా ఇచ్చేందుకు నర్సు అతని భుజాన్ని తాకగానే…ఆ కానిస్టేబుల్ ఒక్కసారిగా నవ్వుతూ మెలికలు తిరిగిపోతున్నాడు. కాసేపు వ్యాక్సిన్ వేయించుకోవటానికి ప్రిపేర్ అవుతున్నట్లుగా ఉండిపోయాడు.ఆ తరువాత నర్సు టీకా వేయటానికి యత్నిస్తుంటే మాత్రం తెగ మెలికలు తిరిగిపోతున్నాడు.

దీనికి సంబంధించిన వీడియోను ఐపీఎస్ అధికారి రూపిన్ శర్మ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాని క్యాప్షన్‌లో… ఇది నాగాల్యాండ్‌లోని కోవిడ్-19 వ్యాక్సినేషన్ సెంటర్ కు సంబంధించిన వీడియో. ఇంతకీ అతనికి టీకా వేశారో లేదో తెలియదు గానీ..అతను ఎందుకు అలా నవ్వుతున్నాడో అర్థం కావడం లేదు. సూది మందు ఇవ్వకుండానే మెలికలు తిరిగిపోతూ హంగామా చేస్తున్నాడు’ అని రాసుకొచ్చారు.

ఈ వీడియోకు వ్యూయర్స్ వారి వారి స్లైట్లో స్పందిస్తూ కామెంట్స్ పెడుతున్నారు. సిగ్గా? భయమా? లేక చక్కిలిగిలా? లేదా అందమైన నర్సులు టీకా వేస్తుంటే ఎంజాయ్ చేస్తున్నాడా? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి మీరు కూడా ఓ లుక్ వేయండీ..ఈ కానిస్టేబుల్ గారి విన్యాసాలపై..