Natyam : ‘నమ: శివాయ’ వీడియో సాంగ్ అద్భుతంగా ఉందంటున్నారు..

పాపులర్ కూచిపూడి డ్యాన్సర్ సంధ్య రాజు, డెబ్యూ మూవీ ‘నాట్యం’ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు..

Natyam : ‘నమ: శివాయ’ వీడియో సాంగ్ అద్భుతంగా ఉందంటున్నారు..

Natyam

Natyam: పాపులర్ కూచిపూడి డ్యాన్సర్ సంధ్య రాజు, డెబ్యూ మూవీ ‘నాట్యం’ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు.. ఈ సినిమాతో సంధ్య రాజు యాక్ట్రెస్, ప్రొడ్యూసర్, కొరియోగ్రాఫర్, ప్రొడక్షన్ డిజైనర్ అండ్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా.. డిఫరెంట్ కేటగిరీల్లో ఇంట్రడ్యూస్ అవుతున్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా మహిళలకు స్పూర్తిగా నిలుస్తున్నారు. తనకు అనుభవమున్న ‘నాట్యం’ గొప్పతనాన్ని, నాట్యకారుల ప్రతిభ గురించి ప్రపంచ నలుమూలల ఉన్న తెలుగు వారికి తెలియజెయ్యాలనే ఉద్దేశంతో.. ‘నిశిృంకల’ అనే బ్యానర్ స్థాపించి సంధ్య రాజు ఈ ‘నాట్యం’ సినిమా చేస్తున్నారు.

కమల్ కామరాజు హీరోగా, యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ రేవంత్ కోరుకొండ ఈ ఫిలింని తెరకెక్కిస్తున్నారు. ‘నాట్యం’ మూవీ నుండి ‘నమ:శివాయ’ అనే పవర్‌ఫుల్ డివోషనల్ సాంగ్ ‘నటసింహా’ నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా రిలీజ్ అయ్యింది. ఆడియెన్స్‌కి గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్న ‘నమ:శివాయ’ వీడియో సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సంధ్య రాజు, కమల్ కామరాజులతో పాటు వందలాది మంది డ్యాన్సర్లతో లేపాక్షి ఆలయ ప్రాంగణంలో ఈ సాంగ్ పిక్చరైజ్ చేశారు.

Natyam

యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ శ్రవణ్ భరద్వాజ్ ట్యూన్ కంపోజ్ చెయ్యగా, కాల భైరవ, లలిత కావ్య చక్కగా పాడారు. జగద్గురు శ్రీ ఆది శంకరాచార్య ‘అర్థనారీశ్వర స్తోత్రం’ అందంగా తెరకెక్కించారు ‘నాట్యం’ టీమ్. రేవంత్ విజువల్స్ పాటను మరింత బ్యూటిఫుల్‌గా మార్చాయి. ఈ సినిమాకి కథ, దర్శకత్వంతో పాటు కెమెరా, ఎడిటింగ్ బాధ్యతలు కూడా చేపట్టారు రేవంత్.

Sandhya Raju

భానుప్రియ, శుభలేఖ సుధాకర్ వంటి సీనియర్ నటులు ఈ మూవీలో నటిస్తున్నారు. రోహిత్ బెహల్, ఆదిత్య మీనన్ ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. కూచిపూడి డ్యాన్సర్‌గా ప్రేక్షకుల ప్రశంసలందుకున్న సంధ్య రాజు ‘నాట్యం’ మూవీతో కూచిపూడి నృత్యం, అందులోని కళలు వంటి పలు అంశాలను ఈ జెనరేషన్ ఆడియెన్స్‌తో పాటు తర్వాత తరాల వారికి కూడా తెలియజెయ్యాలని సంకల్పించడం అభినందనీయం అంటూ తెలుగు ప్రేక్షకులు, సంగీత ప్రియులు, టాలీవుడ్ సెలబ్రిటీలు ఆమెను అప్రిషియేట్ చేస్తున్నారు.