Dasara Movie: యూట్యూబ్‌లో దుమ్ములేపుతున్న సిల్క్ బార్.. మాస్ కా బాప్ అంటోన్న ఫ్యాన్స్!

నాచురల్ స్టార్ నాని నటించిన ‘దసరా’ మూవీ నుండి సిల్క్ బార్ సీన్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ సీన్ కు యూట్యూబ్ లో అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతోంది.

Dasara Movie: యూట్యూబ్‌లో దుమ్ములేపుతున్న సిల్క్ బార్.. మాస్ కా బాప్ అంటోన్న ఫ్యాన్స్!

Nani Dasara Movie Silk Bar Scene Creates Sensation In Youtube

Dasara Movie: నాచురల్ స్టార్ నాని నటించిన ‘దసరా’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేయగా, పూర్తి రా అండ్ రస్టిక్ మూవీగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. ఈ సినిమాలో నాని ఊరమాస్ అవతారంలో చెలరేగిపోయి చేసిన పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఆయన మేకోవర్‌ను అభిమానులు తెగ ఎంజాయ్ చేశారు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది.

Dasara Movie: నైజాంలో కొనసాగుతున్న ‘దసరా’ స్ట్రాంగ్ రన్..!

ఇప్పటికే 110 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి, నాని కెరీర్‌లో బెస్ట్ మూవీగా నిలిచింది. కాగా, ఈ సినిమా నుండి సిల్క్ బార్ సీన్‌ను తాజాగా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ సీన్‌లో తన స్నేహితుడిని కొందరు కొడుతుండగా, నాని సిల్క్ బార్‌లోకి ఎంటర్ అయ్యే విధానం థియేటర్లలో విజిల్స్ వేయించింది. ఊరమాస్ స్వాగ్‌తో నాని ఈ సీన్‌లో చేసిన పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇప్పుడు ఈ సీన్ యూట్యూబ్‌లోనూ దుమ్ములేపుతోంది.

Dasara Movie: మాస్ జాతరను మడతెట్టిన నాని.. మైల్‌స్టోన్ మార్క్‌కు చేరువలో దసరా

యూట్యూబ్‌లో ఈ సీన్ రిలీజ్ అయిన కొద్ది నిమిషాల్లోనూ బాగా వైరల్ అయ్యింది. నాని లాంటి స్టార్‌ను ఇలాంటి మాస్ అవతారంలో చూపెట్టిన విధానానికి శ్రీకాంత్ ఓదెలను ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించగా, దీక్షిత్ శెట్టి హీరో ఫ్రెండ్ పాత్రలో నటించాడు. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు. మరి ఈ సిల్క్ బార్ సీన్‌ను మీరూ చూశారా?