Bose Statue: తెలంగాణ గ్రానైట్ రాయితో సుభాష్ చంద్రబోస్ విగ్రహం తయారు

తెలంగాణ నుంచి తీసుకురానున్న "నల్లపచ్చ ఏక శిల"ను తీసుకువచ్చి సుభాష్ బోస్ విగ్రహ తయారీ ఏర్పాట్లు చేయనున్నట్లు గడనాయక్ తెలిపారు. వరంగల్, ఖమ్మం ఏరియాల్లో ఈ గ్రానైట్ లభిస్తుంది.

Bose Statue: తెలంగాణ గ్రానైట్ రాయితో సుభాష్ చంద్రబోస్ విగ్రహం తయారు

Advata

Bose Statue: స్వాతంత్ర పోరాట యోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్మారకార్థం దేశ రాజధాని ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఆయన నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు శుక్రవారం భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈమేరకు ఒడిశాకు చెందిన ప్రముఖ శిల్పకళా నైపుణ్యుడు, నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడ్రన్ ఆర్ట్ డైరెక్టర్ అద్వైత గడనాయక్ కు ఈబాధ్యతను అప్పగించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒడిశాలోని కటక్ లో జన్మించారు. అద్వైత నాయక్ కూడా ఒడిశాకు చెందిన వారే కావడం విశేషం. దీంతో ఈ అవకాశంపై అద్వైత నాయక్ స్పందిస్తూ.. తమకు ఎంతో ఆరాధ్యుడైన సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని తన ఆధ్వర్యంలో రూపొందించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు.

Also read: World War 2: రెండో ప్రపంచ యుద్ధ కాలంనాటి “మిస్సింగ్ ఫ్లైట్” 80 ఏళ్ల తరువాత భారత్ లో దొరికింది

ప్రధాని మోదీ తనకు అప్పగించిన బాధ్యతను ఎంతో గౌరవంగా భావిస్తున్నట్లు గడనాయక్ తెలిపారు. ఢిల్లీలోని ప్రముఖ పరిపాలన భవనాలు ఉన్న ప్రాంతం “రైసినా హిల్స్” నుంచి చూసినా కనిపించేవిధంగా ఇండియా గేట్ వద్ద సుభాష్ బోస్ విగ్రహం ఏర్పాటు చేస్తామని గడనాయక్ వివరించారు. సుభాష్ బోస్ 125వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తున్నామంటూ ప్రధాని మోదీ చేసిన ప్రకటనతోనే పనులు ప్రారంభమయ్యాయని, తెలంగాణ నుంచి తీసుకురానున్న “నల్లపచ్చ ఏక శిల”ను(Jet Black Granite) తీసుకువచ్చి విగ్రహ తయారీ ఏర్పాట్లు చేయనున్నట్లు గడనాయక్ తెలిపారు. తెలంగాణలోని వరంగల్, ఖమ్మం ఏరియాల్లో ఈ గ్రానైట్ లభిస్తుంది.

Also read: US – Canada: అక్రమంగా సరిహద్దులు దాటుతూ అతిశీతల వాతావరణానికి భారతీయ కుటుంబం బలి

నేతాజీ దృఢ స్వభావాన్ని తెలిపేవిధంగా ఆయన విగ్రహాన్ని రూపొందిస్తామని గడనాయక్ అన్నారు. ఇక నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా జనవరి 23న ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద సుభాష్ చంద్రబోస్ హోలోగ్రామ్ ప్రతిమను ఆవిష్కారించనున్నారు. రాతి శిల్పను ప్రతిష్టించే వరకు ఈ హోలోగ్రామ్ ప్రతిమ అదే స్థానంలో ప్రదర్శించ బడుతుందని, అందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అద్వైత గడనాయక్ తెలిపారు.

Also read: Crime News: లిఫ్ట్ లో అనుమానాస్పద స్థితిలో పనిమనిషి మృతి