Nazia Davison : అచ్చు నజ్రియాలా నజియా. పిక్స్ వైరల్..

అచ్చు నజ్రీయాలానే అలరిస్తుంది నజియా డేవిడ్‌సన్.. ఈమె పూర్తి పేరు నజియా ఒస్సీ డేవిడ్‌సన్..

Nazia Davison : అచ్చు నజ్రియాలా నజియా. పిక్స్ వైరల్..

Nazia Davison

Nazia Davison: ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారంటారు. ఏడుగురు సంగతి ఏమో కానీ ఒక మనిషిలా మరో మనిషి కనిపిస్తేనే ఆశ్చర్యపోతుంటాం. ఇక సెలబ్రిటీల పోలికలతో ఎవరైనా కనిపించారంటే వాళ్లూ చిన్న సైజు సెలబ్రిటీ అయిపోయినట్లే. ఐశ్వర్యరాయ్ పోలికలతో స్నేహా ఉల్లాల్ నుండి పలువురు బ్యూటీస్ దర్శనమిచ్చి పాపులర్ అయ్యారు.

ఇప్పుడు మరో హీరోయిన్ ఫీచర్స్‌తో ఉన్న ఓ క్యూట్ బ్యూటీ పిక్స్ నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. మలయాళీ ముద్దుగుమ్మ నజ్రీయా నజీమ్ ‘రాజా రాణి’ మూవీతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. చక్కటి రూపం, బ్యూటిఫుల్ స్మైల్‌తో చూడగానే ఎట్రాక్టివ్‌గా అనిపించే అందం నజ్రీయాది.

 

View this post on Instagram

 

A post shared by Nazia Ossy Davison (kathryn) (@naziadavison)

అచ్చు నజ్రీయాలానే అలరిస్తుంది నజియా డేవిడ్‌సన్.. ఈమె పూర్తి పేరు నజియా ఒస్సీ డేవిడ్‌సన్.. ఈమె రైటర్, సెల్ఫ్ అడ్మైర్, ఆర్ట్ ఫాలోవర్.. ఇలా చాలా డీటెయిల్స్ పెట్టుకుంది తన ఇన్‌స్టా అకౌంట్‌లో.. క్యాథరిన్ అనే మరో పేరు కూడా ఉందీమెకి. అచ్చు నజ్రీయా పోలికలతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది నజియా డేవిడ్‌సన్..

Pic Credit :@naziadavison

Instagram

టాలెంటెడ్ కపుల్ టాలీవుడ్ ఎంట్రీ..

డిఫరెంట్ కాన్సెప్ట్స్, అంతే డిఫరెంట్ క్యారెక్టర్స్‌తో వెర్సటైల్ యాక్టర్‌గా తనకంటూ సెపరేట్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నారు మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్.. ఈయన నజ్రీయాను వివాహం చేసుకున్నారు. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో వస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిలిం ‘పుష్ప’ తో ఫాహద్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ మూవీలో క్రూషియల్ విలన్ క్యారెక్టర్ చేస్తున్నారయన. అందుకుగానూ భారీ పారితోషికం తీసుకుంటన్నారు.

Pushpa : ‘పుష్ప’ కోసం ఎవరు ఎంతెంత తీసుకుంటున్నారంటే!..

నాని సినిమాతో నజ్రీయా..
సెలక్టివ్‌గా సినిమాలు చేస్తూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు నజ్రీయా నజీమ్. ఫాహద్‌తో మ్యారేజ్ తర్వాత ప్రొఫెషన్ అండ్ పర్సనల్ లైఫ్‌ని చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. భర్తతో కలిసి నటించిన ‘ట్రాన్స్’ నటిగా ఆమెకు మరింత పేరు తెచ్చింది. తెలుగులో నేచురల్ స్టార్ నాని ‘అంటే.. సుందరానికి..!’ అనే సినిమాతో నజ్రీయా తెలుగు ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవుతున్నారు.

Nazriya Fahadh : ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ బెస్ట్ అంటున్న నజ్రియా ఫాహద్.. ఎందుకంటే..