Nazriya Fahadh : ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ బెస్ట్ అంటున్న నజ్రియా ఫాహద్.. ఎందుకంటే..

నేచురల్ స్టార్ నాని హీరోగా న‌టిస్తున్న 28వ చిత్రం ‘అంటే సుందరానికీ..’ వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం ద్వారా న‌జ్రియా న‌జీమ్ తెలుగులో హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మ‌వుతుంది. ‘రాజా రాణి’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన న‌జ్రియా ఈ రోజు నుండి ‘అంటే సుంద‌రానికీ..’ మూవీ షూటింగ్‌లో పాల్గొంటోంది..‌

Nazriya Fahadh : ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ బెస్ట్ అంటున్న నజ్రియా ఫాహద్.. ఎందుకంటే..

Nazriya Fahadh

Nazriya Fahadh: నేచురల్ స్టార్ నాని హీరోగా న‌టిస్తున్న 28వ చిత్రం ‘అంటే సుందరానికీ..’ వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం ద్వారా న‌జ్రియా న‌జీమ్ తెలుగులో హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మ‌వుతుంది. ‘రాజా రాణి’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన న‌జ్రియా ఈ రోజు నుండి ‘అంటే సుంద‌రానికీ..’ మూవీ షూటింగ్‌లో పాల్గొంటోంది. హైద‌రాబాద్‌‌లో జ‌రుగుతున్న ఈ షెడ్యూల్‌లో న‌జ్రియా స‌హా ఇతర కీల‌క తారాగ‌ణంపై స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. ‌

Ante Sundaraniki

ఈ సంద‌ర్భంగా హీరోయిన్ న‌జ్రియా న‌జీమ్.. ‘‘నా ఫ‌స్ట్ తెలుగు మూవీకోసం చాలా ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తున్నాను. ఈ రోజు నా తొలి తెలుగు సినిమా షూటింగ్‌ను మొదలు పెట్టాను. ఫ‌స్ట్‌ చేసే పని ఏదైనా స్పెషల్‌గా ఉంటుంది. కాబట్టి ‘అంటే సుందరానికీ..’ నాకు చాలా స్పెషల్‌” అని పోస్ట్ చేసింది.

ఒరిజిన‌ల్ స్టోరీతో ఒక మ్యూజిక‌ల్ రోమ్-‌కామ్‌గా తెర‌కెక్కుతున్న ‘అంటే సుంద‌రానికీ..’ చిత్రంలోకి న‌జ్రియా న‌జీమ్‌ను ఆహ్వానించింది చిత్ర యూనిట్‌‌. ఈ సంద‌ర్భంగా మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మాత‌లు మాట్లాడుతూ.. ‘‘మా టీమ్ త‌రుపున ‘అంటే సుంద‌రానికీ..’ చిత్రంలోకి న‌జ్రియా న‌జీమ్‌ను స్వాగ‌తిస్తున్నాం. త‌న‌కి, మ‌రియు మా టీమ్ అంద‌రికీ ఈ చిత్రం త‌ప్ప‌కుండా ప్ర‌త్యేకంగా ఉంటుంది’’.. అని అన్నారు.

Nazriya Fahadh

‘బ్రోచేవారెవ‌రురా’ త‌ర్వాత వివేక్ ఆత్రేయతో కలిసి తన‌ ప్రయాణాన్ని కొనసాగిస్తూ వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా, రవితేజ గిరిజాల ఈ చిత్రానికి ఎడిటర్‌గా పని చేస్తున్నారు. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు..