Netflix Games : చిన్నారుల గేమ్స్ కోసం నెట్ ఫ్లిక్స్ సరికొత్త ఫీచర్

నెట్ ఫ్లిక్స్ సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. మొబైల్ వర్షన్ లో గేమ్స్ అడుకునే విధంగా ఈ కొత్త ఫీచర్ దోహదపడనుంది.

Netflix Games : చిన్నారుల గేమ్స్ కోసం నెట్ ఫ్లిక్స్ సరికొత్త ఫీచర్

నెట్ ఫ్లిక్స్ గేమ్స్ సరికొత్త ఫీచర్

Netflix Games : వినోదాత్మక రంగంలో దూసుకుపోతూ తనదైన స్ధానాన్ని ఆక్రమించింది నెట్ ఫ్లిక్స్.. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై తనకు ఎదురులేదని నిరూపించుకున్న ఆసంస్ధ , ఇప్పుడు గేమింగ్ రంగంపై దృష్టిసారించింది. చిన్నారులు, యువత ఇటీవలికాలంలో ఆన్ లైన్ గేమింగ్ పై ఎక్కవ మక్కువ చూపిస్తున్నారు. ఈనేపధ్యంలో దీనిని అవకాశంగా మలుచుకునేందుకు నెట్ ఫ్లిక్స్ సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానుంది. మొబైల్ వర్షన్ లో గేమ్స్ అడుకునే విధంగా ఈ కొత్త ఫీచర్ దోహదపడనుంది.

కరోనా పరిస్ధితుల నేపధ్యంలో చిన్నారులు, యువకులు ఇళ్ళకే పరిమితమయ్యారు. చదువులు సరిగా సాగకపోవటం, ఉన్న పరిమిత సమయం ఆన్ లైన్ క్లాసులే కావటంతో మిగిలిన సమయాన్ని గేమ్స్ తో గడిపేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం వీడియో గేమింగ్ ట్రెండ్ కొనసాగుతుంది. 2012 నుండి 2021వరకు స్టాటిస్టా మార్కెట్ ఎనాలసిస్ ప్రకారం 52.8 శాతం నుండి 138.4 శాతానికి వీడియో గేమ్స్ వినియోదారుల సంఖ్య పెరిగినట్లు స్పష్టమౌతుంది.

ఈక్రమంలోనే నెట్ ఫ్లిక్స్ గేమింగ్ వ్యవస్ధపై కన్నేసింది. ఇందుకోసం గేమ్ డెవలప్ మెంట్ వైస్ ప్రెసిడెంట్ గా ఫేస్ బుక్ ఎగ్జిక్యూటివ్ మైక్ వెర్దును నెట్ ఫ్లిక్స్ నియమించుకుంది. వచ్చే ఏడాది చివరి కల్లా కిడ్స్ రీ క్యాప్ ఈమెల్, కిడ్స్ టాప్ 10 రో పేరుతో సిరీస్ ను విడుదల చేయనున్నట్లు వైస్ ప్రెసిడెంట్ గా నియమితులైన మైక్ వెర్దు తెలిపారు.