Anasuya Bharadwaj : ‘బంగారం’ సిస్టర్ అంటూ ట్రోల్స్..

‘పుష్ప’ మూవీలో అనసూయ లుక్‌‌ని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్..

Anasuya Bharadwaj : ‘బంగారం’ సిస్టర్ అంటూ ట్రోల్స్..

Bangaram

Updated On : November 10, 2021 / 4:47 PM IST

Anasuya Bharadwaj: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న హ్యట్రిక్ సినిమా ‘పుష్ప’.. ఈ క్రేజీ పాన్ ఇండియా మూవీని మైత్రీ మూవీస్, ముత్తంశెట్టి మీడియా కలిసి నిర్మిస్తున్నాయి. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది.. పాటలతో, క్యారెక్టర్ల ఇంట్రడక్షన్ పోస్టర్లతో సినిమా మీద అంచనాలు మరింత పెంచేస్తున్నారు మేకర్స్.

Naatu Naatu Song : గట్టు మీద గడ్డపారలు! ఫ్యూజ్‌లు ఎగిరిపోయేలా ఎన్టీఆర్ – చరణ్ డ్యాన్స్ !

ఈ సినిమాలో స్టార్ యాంకర్ అండ్ టాలెంటెడ్ యాక్ట్రెస్ అనసూయ భరద్వాజ్ ఇంపార్టెంట్ రోల్ చేస్తుంది. బుధవారం ఆమె నటిస్తున్న దాక్షాయణి క్యారెక్టర్‌ను ఇంట్రడ్యూస్ చేస్తూ లుక్ రిలీజ్ చేశారు. ‘రంగస్థలం’ లో రంగమ్మత్త పాత్రతో అనసూయలోని మరో కోణాన్ని ఆవిష్కరించిన దర్శకుడు సుకుమార్.. ఇప్పుడు దాక్షాయనిగా సరికొత్తగా చూపించబోతున్నారు.

Naatu Naatu Song : థియేటర్లు దద్దరిల్లడం ఖాయం.. 10టీవీతో రాహుల్ సిప్లిగంజ్..

నోట్లో ఆకు నములుతూ.. చేతిలో అడకత్తెర పట్టుకుని పోకచెక్కలు పగల గొడతూ అనసూయ ఇచ్చిన లుక్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. పోస్టర్‌లో ఉన్న ఇంపాక్ట్ కంటే.. సినిమాలో అనసూయ క్యారెక్టర్ 100 రెట్లు ఎక్కువగా ఉంటుందని నమ్మకంగా చెబుతున్నారు మేకర్స్.

Naatu Naatu Song : దుమ్ములేపి దమ్ము చూపిన డాన్సర్లు.. చెర్రీ, NTR ఫ్యాన్స్‌కు అసలైన దీపావళి

దాక్షాయణి లుక్ బాగుందంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ అనసూయ లుక్‌‌ని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘బంగారం’ సినిమాలో విలన్ అశుతోష్ రానాకు అక్కగా చేసిన నటి లుక్ మాదిరిగానే అనసూయ లుక్ ఉందంటున్నారు. హెయిర్ స్టైల్ దగ్గరి నుండి ఆకు నమిలే వరకు అచ్చు ఆమెలానే అనసూయ కనిపిస్తోంది.. ‘బంగారం’ సిస్టరా ఏంటని కామెంట్స్ చేస్తున్నారు.

Anasuya Bharadwaj : పొగరున్న దాక్షాయణిగా షాకింగ్ లుక్‌లో అనసూయ!

గుండు చేయించుకుంటారా?..
అలాగే ఇన్‌‌స్టాలో ఓ నెటిజన్.. ఇప్పుడు హెయిర్ స్టైల్ ఇలా డిఫరెంట్‌గా మార్చుకున్నారు కదా.. ఎవరైనా పెద్ద హీరో సినిమాలో క్యారెక్టర్ వస్తే గుండు చేయించుకుంటారా అని అడగ్గా.. హ్యాపీగా చేయించుకుంటాను’ అని ఆన్సర్ ఇచ్చింది అనసూయ.

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)