Naatu Naatu Song : దుమ్ములేపి దమ్ము చూపిన డాన్సర్లు.. చెర్రీ, NTR ఫ్యాన్స్‌కు అసలైన దీపావళి

హీరోలు పాడుతూ వేస్తున్న స్టెప్పులతో.... అక్కడంతా దుమ్ములేచిపోవడం... బ్రిటీష్ వాళ్లు బెదిరిపోవడం లాంటి సీన్లు.................................

Naatu Naatu Song : దుమ్ములేపి దమ్ము చూపిన డాన్సర్లు.. చెర్రీ, NTR ఫ్యాన్స్‌కు అసలైన దీపావళి

Naatu Naatu Song Rrr

RRR- Naatu Naatu Song : జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ ఇద్దరే. దుమ్ములేపే డాన్సర్లే. వారిద్దరూ చేసే స్టైలిష్ డాన్సుల కోసమే థియేటర్లకు వచ్చేవాళ్లు కోట్లమంది ఉంటారు. అలాంటి ఈ ఇద్దరూ ఒకే వేదికపై, ఒకే ఫ్రేమ్ లో ఉంటే.. సేమ్ స్టెప్స్ ఇద్దరూ వేస్తుంటే …. కళ్లు జిగేల్మనాల్సిందే. RRR మూవీలోని నాటు నాటు పాటను సడెన్ సర్‌ప్రైజ్ లాగా రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటివరకు ఎన్టీఆర్, రామ్ చరణ్ వయొలెంట్ యాక్షన్ పెర్ఫామెన్స్ చూపించిన రాజమౌళి… మూవీలోని మరో షేడ్ ను చూపించి దేశాన్ని నాటు స్టెప్పులేయిస్తున్నారు.

Read This : Naatu Naatu Song : గట్టు మీద గడ్డపారలు! ఫ్యూజ్‌లు ఎగిరిపోయేలా ఎన్టీఆర్ – చరణ్ డ్యాన్స్ !

ఎన్టీఆర్-రామ్ చరణ్ ఒకే ఫ్రేమ్ లో డాన్స్ చేసే Sparkling సీన్ చూసేందుకు మామూలు మూవీ ఆడియన్స్ కే రెండు కళ్లు చాలవు. వీరాభిమానులైతే… కళ్లు పేలిపోవాల్సిందే. స్టిల్స్ చూసి… డాన్సావేశంతో ఊగిపోయిన మెగా, నందమూరి అభిమానులు.. ఇప్పుడు నాటు నాటు లిరికల్ పాటలో ఆరాధ్య దైవాలైన హీరోల జోడీ వేసిన స్టెప్పుల కారణంగా.. డాన్స్ పూనకంతో ఊగిపోతున్నారు.

ఎన్టీఆర్, రామ్ చరణ్ కెరీర్ లో ఇప్పటికే పలు ఊర మాస్ పాటలు వచ్చాయి. ఇది వాటన్నంటికీ మించి… ఊరెస్ట్ మాస్ సాంగ్ గా మారిపోతుందని అంచనాలు ఏర్పడ్డాయి.

రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ ఈ పాటను కలిసి పాడారు. హీరోల స్టెప్పుల్లోని జోష్ ను వందింతలు పెంచేలా చంద్రబోస్ ఊర మాస్ పదాలతో పాట రాశాడు. ఎంఎం కీరవాణి ట్రెడిషనల్ మాస్ మసాలా ట్యూన్ తో దంచి పడేశాడు. ప్రేమ్ రక్షిత్ ఈ పాటకు డాన్స్ కొరియో గ్రఫీ చేశాడు.

Read This : RRR: జక్కన్న నాటు ప్రమోషన్స్.. దెబ్బకి సోషల్ మీడియా షేక్!

పాట నేపథ్యం చాలా ఇంట్రస్టింగ్ గా అనిపిస్తోంది. బ్రిటీష్ వాళ్ల ముందు.. కొమ్రం భీం, అల్లూరి సీతారామ రాజు పాత్రలు ఇలా స్టెప్పులతో అలరించి.. ఆ తర్వాత పాట స్థాయిలోనే ఏదో భారీ విధ్వంసానికి ప్లాన్ చేశారన్నట్టుగా అనిపిస్తుంది. హీరోలు పాడుతూ వేస్తున్న స్టెప్పులతో…. అక్కడంతా దుమ్ములేచిపోవడం… బ్రిటీష్ వాళ్లు బెదిరిపోవడం లాంటి సీన్లు సాంగ్‌లో కనిపించాయి. నాటు నాటు పాటకు తగ్గట్టుగా… స్టెప్పులు కూడా ఊర మాస్ గా ఉండి అందరినీ అలరిస్తున్నాయి. ఇద్దరు హీరోల డాన్స్ కు ఫిదా అవుతూ బ్రిటీష్ భామ అండ్ కో ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ పీక్స్.