Kangana Ranaut: కంగనాలో కొత్త యాంగిల్.. కుర్రకారుకి కునుకు కరువాయే!
ఈ మధ్య కాలంలో కంగనా రనౌత్ అంటే ఫైర్ బ్రాండ్ అనే ముద్ర పడిపోయింది. అప్పుడప్పుడూ తనలో కూడా ఆడతనం ఉందని కాస్త కలర్ ఫుల్ ఫోటోషూట్లు చేసినా ఆమె ఫైర్ బ్యాండ్ ఆ ఫోటోలు డామినేట్ చేసేసేవి.

Kangana Ranaut
Kangana Ranaut: ఈ మధ్య కాలంలో కంగనా రనౌత్ అంటే ఫైర్ బ్రాండ్ అనే ముద్ర పడిపోయింది. అప్పుడప్పుడూ తనలో కూడా ఆడతనం ఉందని కాస్త కలర్ ఫుల్ ఫోటోషూట్లు చేసినా ఆమె ఫైర్ బ్యాండ్ ఆ ఫోటోలు డామినేట్ చేసేసేవి.
సినిమాల ఎంపికలో కూడా కాస్త గ్లామరస్ పాత్రలకు దూరంగా ఉండడంతో అమ్మడి అందాలకి కిరాకీ తగ్గింది అనుకుందేమో కానీ ఒక్కసారిగా అందాల ఆరబోతకు గేట్లు ఎత్తేసింది. ఫలితంగా కుర్రకారుకి కునుకు లేకుండా పోయింది.
ఫైర్ బ్రాండ్ మాత్రమే కాదు.. ఒన్స్ బోల్డ్ లుక్ లోకి దిగినా కంగనా అంటే ఆ క్రేజీ వేరు అన్నట్లుగా ఇప్పుడు తాజా ఫోటోలు ఇంటర్నెట్ ను హోరెత్తిస్తున్నాయి.
రాజకీయాల నుండి సినీ పరిశ్రమల సమస్యల వరకు అన్నటికి స్పందించే సామాజిక స్పృహ ఎక్కువగా ఉండే కంగనాలో ఈ గ్లామరస్ యాంగిల్ కూడా ఉందా అంటూ నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు.
ప్రభాస్ – పూరి జగన్నాధ్ ఏక్ నిరంజన్ సినిమాతో తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చిన కంగనా ఆ సినిమా అనుకున్న స్థాయి సక్సెస్ కాకపోవడంతో బాలీవుడ్ మీద ఫోకస్ పెట్టింది.
ఇప్పుడు అక్కడ లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కంగనా పెట్టింది పేరు.
ప్రస్తుతం కంగనా నటించిన సినిమాలలో తమిళనాడు మాజీ సీఎం, నటి జయలలిత బయోపిక్ తలైవి సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా ధాకడ్ సినిమా షూటింగ్ దశలో ఉంది.