Bengal: మమత కేబినెట్‭లో‭ కొత్తగా 9 మంది మంత్రులు

బాబుల్ సుప్రియో బీజేపీ నుంచి గతంలో పార్లమెంట్‭కు ప్రాతినిథ్యం వహించారు. అనంతరం బీజేపీకి రాజీనామా చేసి టీఎంసీలో చేరారు. ప్రస్తుతం కలకత్తాలని బల్లిగుంగె అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీఎంసీ తరపున అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కొత్త కేబినెట్‌లో యువ రక్తానికి అవకాశం ఇవ్వాలని మమత భావించారని, ఆ ఆలోచనలో భాగంగానే బాబుల్ సుప్రియో, పార్థా భౌమిక్, స్నేహశీష్ చక్రవర్తికి మంత్రులుగా అవకాశం కల్పించారని టీఎంసీ సీనియర్ నేత ఒకరు చెప్పారు

Bengal: మమత కేబినెట్‭లో‭ కొత్తగా 9 మంది మంత్రులు

West Bengal: పశ్చిమ బెంగాల్ కేబినెట్‭ను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ‭ పునర్వవస్తీకరించారు. బాబుల్ సుప్రియో సహా మొత్తం తొమ్మిది మంత్రి మంత్రులుగా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో బాబుల్ సుప్రియో, పార్థా భౌమిక్, స్నేహసిస్ చక్రవర్తి, ఉదయాన్ గుహ, ప్రదీప్ మజుందర్, తాజ్‭ముల్ హొస్సేన్, సత్యజిత్ బర్మాన్‭లకు రాష్ట్ర కేబినెట్ హోదా ఇచ్చారు. బిర్బాహా హంస్దా, బిప్లబ్ రాయ్ చౌదరిలకు స్వతంత్ర మంత్రి హోదా ఇచ్చారు. రాజ్‌భవన్‌లో మమత బెనర్జీ సమక్షంలో గవర్నర్ లా గణేషన్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. చాలా నిరాడంబరంగా ఈ కార్యక్రమం జరిగింది. టీఎంసీలో సీనియర్ మంత్రిగా పనిచేసిన పార్థా ఛటర్జీని ఈడీ అరెస్ట్ చేసిన పరిణామాల నేపథ్యంలో మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ జరగడం గమనార్హం.

బాబుల్ సుప్రియో బీజేపీ నుంచి గతంలో పార్లమెంట్‭కు ప్రాతినిథ్యం వహించారు. అనంతరం బీజేపీకి రాజీనామా చేసి టీఎంసీలో చేరారు. ప్రస్తుతం కలకత్తాలని బల్లిగుంగె అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీఎంసీ తరపున అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కొత్త కేబినెట్‌లో యువ రక్తానికి అవకాశం ఇవ్వాలని మమత భావించారని, ఆ ఆలోచనలో భాగంగానే బాబుల్ సుప్రియో, పార్థా భౌమిక్, స్నేహశీష్ చక్రవర్తికి మంత్రులుగా అవకాశం కల్పించారని టీఎంసీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. మరికొందరు టీఎంసీ నేతలు మాట్లాడుతూ.. మమత కేబినెట్‌లో గత 11 ఏళ్లుగా కోల్‌కత్తాకు చెందిన వారికే పదవులు దక్కాయని.. ఈసారి జిల్లాల్లో నేతలకూ అవకాశం ఇవ్వాలనే వ్యూహంలో భాగంగానే కొత్తగా కొందరికి మంత్రి పదవులు దక్కాయని తెలిపారు.

Tiranga campaign: మోదీ సందేశం సొంతింటికే చేరలేదు: RSSపై కాంగ్రెస్