Tiranga campaign: మోదీ సందేశం సొంతింటికే చేరలేదు: RSSపై కాంగ్రెస్

దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ అనే కార్యక్రమాన్ని ఏడాది కాలంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ నెల 15న దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశంలోని ప్రజలు సోషల్ మీడియాలోని తమ ఖాతాల్లో డీపీలను త్రివర్ణ పతాకానికి మార్చాలని జూలైలో నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ‘తిరంగ యాత్ర’ అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు

Tiranga campaign: మోదీ సందేశం సొంతింటికే చేరలేదు: RSSపై కాంగ్రెస్

Tiranga campaign: దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ అనే కార్యక్రమాన్ని ఏడాది కాలంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ నెల 15న దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశంలోని ప్రజలు సోషల్ మీడియాలోని తమ ఖాతాల్లో డీపీలను త్రివర్ణ పతాకానికి మార్చాలని జూలైలో నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ‘తిరంగ యాత్ర’ అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రధాని పిలుపు మేరకు బీజేపీ నేతలు కార్యకర్తలు సహా దేశంలోని అనేక మంది తమ డీపీలు మార్చారు. బీజేపీ వ్యతిరేకుల్లోని చాలా మంది కొద్ది పాటి మార్పులతో తమ డీపీలను జాతీయ జెండాలతో నింపివేస్తున్నారు.

అయితే బీజేపీ మాతృ సంస్థగా చెప్పుకునే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సహా ఆ సంఘ్ అధినేత మోహన్ భాగవత్‭ల ట్విట్టర్ డీపీలు మారకపోవడంపై సహజంగానే నెటిజెన్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ లేవనెత్తి మోదీపై విమర్శలు గుప్పించింది. ప్రధాని సందేశం సొంతింటికి కూడా చేరలేదంటూ కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. అలాగే 52 ఏళ్లలో నాగ్‭పూర్‭లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో ఎప్పుడూ జాతీయ జెండా ఎగరలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ‘‘1929లో లాహర్ సమీపంలోని రావి నది ఒడ్డున జవహార్‭లాల్ నెహ్రూ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తూ ‘‘ఇది ఈరోజు ఎగరవేయబడిందని గర్తుంచుకోవాలి. అలాగే భారతీయ పురుష, మహిళ, పిల్లలు ఎవరైనా సరే వారు బతికున్నంత కాలం కింద పడకుండా చూసుకోవాలి’’ అని అన్నారు. ప్రజలు కూడా దాన్ని ఆచరిస్తూ వచ్చారు. అందుకే నెహ్రూ చేతిలో తిరంగా ఉన్న డీపీని మేము ఎంచుకున్నాం. కానీ ప్రధానమంత్రి సందేశం ఆయన సొంతింటికి(ఆర్ఎస్ఎస్ కార్యాలయం) చేరినట్లు లేదు. 52 ఏళ్లుగా నాగ్‭పూర్‭లోని తమ ప్రధాన కార్యాలయంలో జెండా ఎగరవేయని వారు ప్రధాని మాట వింటారా?’’ అని విమర్శలు గుప్పించారు. రాహుల్ సహా కాంగ్రెస్ నేతలు త్రివర్ణ పతాకాన్ని చేతుల్లోకి తీసుకున్న నెహ్రూ ఫొటోను తమ డీపీగా మార్చుకుంటున్నారు.

Karnataka మాజీ సీఎం బర్త్‭డే.. హైవేపై 6km జామ్