Karnataka మాజీ సీఎం బర్త్‭డే.. హైవేపై 6km జామ్

కార్ణాటక కాంగ్రెస్‭కు ముఖ్య నేతగా ఉన్న సిద్ధరామయ్య.. 2013లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. అనంతరం ఐదేళ్ల పాటు కర్ణాటక ముఖ్యమంత్రిగా పని చేశారు. 2023లో మళ్లీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పటి నుంచే ప్రచార సన్నాహాలు జరుగుతున్నాయి. సిద్ధూ పుట్టినరోజు వేడుకల్ని కూడా రాజకీయ ప్రచారానికి మలుచుకునే విధంగా నిర్వహించబోతున్నట్లు సమాచారం

Karnataka మాజీ సీఎం బర్త్‭డే.. హైవేపై 6km జామ్

Siddaramaiah birthday: కర్ణాటక మాజీ మఖ్యమంత్రి పుట్టినరోజు వేడుక భారీ ట్రాఫిక్ జాంకు దారి తీసింది. భారీ ఎత్తున పార్టీ కార్యకర్తలు సిద్ధూ అభిమానులు రావడంతో బెంగళూరు-పూణె హైవే(NH48)పై సుమారు ఆరు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. బుధవారం దావణగెరె జిల్లాలో సిద్ధూ 75వ పుట్టిన రోజు వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకకి కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత రాహల్ గాంధీ హాజరుకానున్నారట. దీంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులు సహా సిద్ధరామయ్య అభిమానులు, సానుభూతిపరులు పెద్ద ఎత్తున దావణగెరెకు బయల్దేరారు. భారీ సంఖ్యలో వాహనాలు రావడంతో దేవనగెరె వద్ద పెద్ద ఎత్తున ట్రాఫిక్ జాం ఏర్పడి ఆరు కిలోమీటర్ల మేర వాహనాలు కిక్కిరిసిపోయాయి.

కార్ణాటక కాంగ్రెస్‭కు ముఖ్య నేతగా ఉన్న సిద్ధరామయ్య.. 2013లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. అనంతరం ఐదేళ్ల పాటు కర్ణాటక ముఖ్యమంత్రిగా పని చేశారు. 2023లో మళ్లీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పటి నుంచే ప్రచార సన్నాహాలు జరుగుతున్నాయి. సిద్ధూ పుట్టినరోజు వేడుకల్ని కూడా రాజకీయ ప్రచారానికి మలుచుకునే విధంగా నిర్వహించబోతున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో సిద్ధూ పుట్టినరోజు వేడుకలు జరగనున్నాయి. దావణగెరెకు ఒక్క వాయువ్య కర్ణాటక నుంచే 325 ఆర్టీసి బస్సులు బుక్కయ్యాయట. ఇవి కాక ప్రైవేటు వాహనాలు వందల సంఖ్యలో ఉంటాయి. ఇక రాజధాని బెంగళూరు సహా రాష్ట్ర నలుమూలల నుంచి వేల సంఖ్యలో వాహనాలు వస్తున్నట్లు కేపీసీసీ పేర్కొంది.

ఒకవైపు సిద్ధూ పుట్టినరోజు, రాహుల్ రాకడ నేపథ్యంలో కాంగ్రెస్ అభిమానులు కోలాహాలంలో ఉంటే.. భారీ ట్రాఫిక్ జాం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని నెట్టింట్లో షేర్ చేస్తూ కాంగ్రెస్ పార్టీపై తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక నెటిజెన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ‘‘డియర్ రాహుల్ గాంధీ.. మీరు దావణగెరెలో నిర్వహించే కార్యక్రమంలో ప్రజల్ని కలుసుకోవడానికి వస్తున్నారు. మేమేమో ఎన్‭హెచ్-48పై భారీ ట్రాఫిక్ జాం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. 200 మీటర్ల దూరం దాటడానికి గంట సమయం పడుతోంది. ఇలా అసౌకర్యాన్ని తొలగించడానికి మీరేమైనా చెస్తే మంచిది. ఇది నా వినయ పూర్వక విజ్ణప్తి’’ అని రాసుకొచ్చాడు.