తీరం తాకిన నిసర్గ తుఫాన్, ముంబైని ముంచెత్తిన వర్షాలు

  • Published By: naveen ,Published On : June 3, 2020 / 07:49 AM IST
తీరం తాకిన నిసర్గ తుఫాన్, ముంబైని ముంచెత్తిన వర్షాలు

రెండు రాష్ట్రాలను(మహారాష్ట్ర, గుజరాత్) భయపెట్టిన నిసర్గ తుఫాన్(Nisarga Cyclone) తీరాన్ని తాకింది. బుధవారం (జూన్ 3,2020) మధ్యాహ్నం 1 గంటకు ముంబై సమీపంలోని అలీబాగ్ ప్రాంతంలో తుఫాన్ తీరాన్ని తాకింది. తుఫాన్ ధాటికి అరేబియా సముద్రం అల్లకల్లోలంగా మారింది. వందల కిమీ వేగంతో గాలులు వీస్తున్నాయి. ముంబై తీరంలో అలలు ఎగిసిపడుతున్నాయి. మరికొన్ని గంటల్లో తుఫాన్ పూర్తిగా తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. తుఫాన్ తీరం దాటిన తర్వాత 6 గంటల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఉత్తర మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్ లో భారీ వర్షాలు పడుతున్నాయి. తుఫాన్ ప్రభావంతో కర్నాటక, గోవా, మధ్యప్రదేశ్ లోనూ వర్షాలు కురుస్తున్నాయి. రాయ్ గఢ్, ముంబైలో ఇప్పటికే భారీ వానలు పడుతున్నాయి.

ముంబైలో సహాయక చర్యలకు 30 ఎన్డీఆర్‌‌ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని అధికారులు చెప్పారు. తుఫాన్ ప్రభావం గుజరాత్‌పై కూడా ఎక్కువగా ఉందని అన్నారు. ఈ మేరకు అక్కడ కూడా చర్యలు అనేక చర్యలు చేపట్టారు. సముద్ర తీరంలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మహారాష్ట్ర, గుజరాత్‌ సీఎంలతో ప్రధాని మోడీ ఫోన్‌లో మాట్లాడి పరిస్థితి గురించి ఆరా తీశారు. ఇప్పటికే కరోనాతో అతలాకుతలమవుతున్న ముంబై సిటీని ‘నిసర్గ’ తుఫాను వణికిస్తోంది. వారం పది రోజుల వ్యవధిలో దేశం ఎదుర్కొంటున్న రెండో తుఫాను ఇది. వందేళ్ల తర్వాత ముంబైకి తుఫాను ముప్పు రావడం ఇదే.

Read: 100 ఏళ్ల తరువాత ముంబైపై అరేబియా ఆగ్రహం..దూసుకొస్తున్న ‘నిసర్గ’ తుపాను