RTAకు వెళ్లాల్సిన అవసరం లేదు..OnLine లోనే

  • Published By: madhu ,Published On : June 4, 2020 / 02:25 AM IST
RTAకు వెళ్లాల్సిన అవసరం లేదు..OnLine లోనే

ఇక RTAకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఏమైనా..అంతా ఆన్ లైన్ లో చేసుకోవచ్చు. నేరుగా ఇంటి నుంచే కొన్ని రకాల పౌర సేవలను పొందవచ్చంటున్నారు అధికారులు. ఇందుకు ఆర్టీఏ ప్రణాళికలను రూపొందించింది. మరో వారం, పది రోజుల్లో ఈ సదుపాయం అందుబాటులోకి రానుందని అధికారులు వెల్లడించారు. లెర్నింగ్ లైసెన్స్ లు, శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ లు, వాహనాల క్రయ విక్రయాలు వంటి వినియోగదారులు స్వయంగా రావాల్సిన పౌర సేవలను మినహాయించి..17 రకాల సేవలను ఆన్ లైన్ ద్వారా నేరుగా వినియోగదారులకు అందచేసేందుకు అధికారులు కసరత్తు జరుపుతున్నారు. ఇందుకు సంబంధించిన ట్రయల్స్ కూడా పూర్తయ్యాయి. 

ప్రస్తుతం వివిధ రకాల పౌర సేవల కోసం వినియోగదారులు తొలుత ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్ లైన్ లో, ఈ సేవా కేంద్రాల ద్వారా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజులు చెల్లించాలి. స్లాట్ లో నమోదైన తేదీ, సమయం ప్రకారం..ఆర్టీఏకు వెళ్లి..పత్రాలను అధికారులకు అందచేయాలి. ఫొటో దిగి, డిజిటల్ సంతకం చేయాలి. దీంతో దరఖాస్తు ప్రకియ స్టార్ట్ అవుతుంది.

పది రోజుల తర్వాత..దరఖాస్తు చేసుకున్న ఇంటి వద్దకే ధృవపత్రాలు వచ్చేస్తాయి. ఇక్కడ సెల్ఫీ, డిజిటల్ సంతకం కీలకం. దళారులు, మధ్యవర్తుల బెడద ఉండదు. నకిలీ డ్యాక్యుమెంట్లకు చెక్ పడనున్నాయి. దరఖాస్తు చేసుకున్న వారికి SMS ద్వారా వినియోగదారులు కోరుకున్న సేవలను ధృవీకరిస్తూ..ఒక నంబర్ ను కేటాయిస్తారు. ఆర్టీఏ ఆన్ లైన్ సేవల్లో జాప్యం చోటు చేసుకున్నా..సాంకేతిక సమస్యలు తలెత్తినా..ఈ నంబర్ ఆధారంగా వివరాలు పొందవచ్చు. 

కాలపరిమితి పొడిగింపు, లెర్నింగ్ లెసెన్స్ లో ఒకటి కంటే ఎక్కువ వాహనాలకు అనుమతి కోరడం, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్, వాహన రిజిస్ట్రేషన్ డూప్లికేట్ పత్రాలు, గడువు ముగిసిన వాటి రెన్యూవల్, డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్, 6 నెలల గడువు ముగిసిన లెర్నింగ్ లైసెన్స్, వివిధ రకాల డాక్యుమెంట్ల చిరునామాలో మార్పు, అంతర్ రాష్ట్ర సేవలపైన తీసుకోవాల్సిన నిరభ్యంతర పత్రాలు, రవాణా వాహనాల పర్మిట్లు, త్రైమాసిక పన్ను చెల్లింపులు వంటి 17 రకాల సేవలను ఆన్ లైన్ పరిధిలోకి తేనున్నారు. 

Read: తెలంగాణలో త్వరలో సినిమా షూటింగ్స్