లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

మూడు సార్లు వాయిదా.. బాండ్ వచ్చేది ఎప్పుడయ్యా?..

Updated On - 7:06 pm, Sat, 23 January 21

No Time to Die: ప్రపంచ సినీ చరిత్రలో జేమ్స్ బాండ్ చిత్రాలకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. లాక్‌డౌన్ తర్వత రిలీజ్ అవుతున్న ‘నో టైమ్ టు డై’ (No Time to Die) సినిమా మీదే అందరి కళ్లూ. ప్రపంచం మొత్తం ఎప్పుడెప్పుడు బాండ్‌ని చూద్దామా అని వెయిట్ చేస్తుంటే.. బాండ్ మాత్రం పోస్ట్ పోన్ అవుతూనే ఉన్నాడు. అయితే ఇన్నాళ్లకి నేనొస్తున్నానోచ్ అంటూ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు జేమ్స్ బాండ్.

వరల్డ్స్ మోస్ట్ అవెయిటింగ్ మూవీ జేమ్స్ బాండ్.. డేనియల్‌ క్రెగ్‌ హీరోగా ‘నో టైమ్ టు డై’ టైటిల్‌తో బాండ్ సిరీస్‌లో 25వ సినిమాగా వస్తోంది. జేమ్స్ బాండ్ అనగానే కళ్ళముందు కదిలే యాక్షన్ కెరటంలా ఉండే 54 ఏళ్ళ డేనియల్ నాలుగోసారి బాండ్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాని మోట్రో గోల్డెన్‌ మేయర్‌, ఇయోన్ ప్రొడక్షన్స్‌ సంస్థలు కలిసి దాదాపు 2 వేల కోట్ల బడ్జెట్‌తో జోజీ ఫకునగా ఎలక్ట్రిఫైయింగ్ యాక్షన్ సీన్స్‌తో తెరకెక్కించారు. సినిమాని ఈ అక్టోబర్ 8న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తున్నామని అనౌన్స్ చేసి బాండ్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పారు.

ఎప్పడెప్పుడు ఈ జేమ్స్ బాండ్ మూవీని చూద్దామా అని సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. నిజానికి ఈ సినిమా 2020 ఏప్రిల్ 3న బ్రిటన్, ఏప్రిల్ 8న అమెరికాలో రిలీజ్ చేస్తున్నట్టు లాక్‌డౌన్‌కి ముందెప్పుడో టీమ్ ఎనౌన్స్ చేశారు. కానీ కరోనాతో మొత్తం పోస్ట్ పోన్ అయ్యింది. తర్వాత లాస్ట్ ఇయర్ నవంబర్‌లో రిలీజ్ చేద్దామనుకున్నారు. అదికూడా కుదరక.. ఈ 2021 ఏప్రిల్‌కి బాండ్‌ని థియేటర్లోకి తీసుకొద్దామనుకున్నారు. కానీ అది కూడా వర్కవుట్ కాక.. ఈ సంవత్సరం లాస్ట్ క్వార్టర్‌కి షిఫ్ట్ చేసి అక్టోబర్ 8 న రిలీజ్ అని ఫిక్స్ చేశారు.

ఈ 25వ జేమ్స్ బాండ్ మూవీ లాక్‌డౌన్ తర్వాత రాబోతున్న ఫస్ట్ స్టార్ హీరో అండ్ ఇంటర్నేషనల్ సినిమా అవ్వడంతో అందరూ సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. రూ. 2 వేల కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నెవర్ బిఫోర్ యాక్షన్ సీన్స్‌తో పాటు మెస్మరైజింగ్ బాండ్ హీరోయిన్స్, మిస్టీరియస్ వెహికల్స్‌‌తో ఈ సారి ఆడియన్స్‌కి మరింత విజువల్ ఫీస్ట్ ప్లాన్ చేశారు మేకర్స్. అంతకు ముందు సినిమాల్లో వాడిన ఆస్టిన్ మార్టిన్ కార్లన్నింటినీ.. ఈ జేమ్స్ బాండ్ సినిమాలో వాడుతున్నట్టు అనౌన్స్ చేశారు. ఇప్పటికే ట్రైలర్‌లో కార్లతో డేనియల్ క్రేగ్ చేసిన ఫీట్లు చూసి సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేసుకునారు ఫ్యాన్స్. ‘నో టైమ్ టు డై’ బాండ్ సినిమాని ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తెలుగులో కూడా రిలీజ్ చేయనున్నారు.