Nokia C12 Pro Sale : నోకియా C12 ప్రో సేల్ మొదలైందోచ్.. కేవలం రూ.6,999 మాత్రమే.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి!

Nokia C12 Pro Sale : ప్రముఖ నోకియా HDM గ్లోబల్ ఇటీవలే నోకియా C12 ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్‌ను ప్రకటించింది. ఇప్పుడు మరో కొత్త బడ్జెట్ ఫోన్‌ నోకియా C12 ప్రో (Nokia C12 Pro)ను లాంచ్ చేసింది.

Nokia C12 Pro Sale : నోకియా C12 ప్రో సేల్ మొదలైందోచ్.. కేవలం రూ.6,999 మాత్రమే.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి!

Nokia C12 Pro Sale _ Nokia C12 Pro goes official, launched in India with price starting at Rs 6999

Nokia C12 Pro Sale : ప్రముఖ నోకియా HDM గ్లోబల్ ఇటీవలే నోకియా C12 ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్‌ను ప్రకటించింది. ఇప్పుడు మరో కొత్త బడ్జెట్ ఫోన్‌ నోకియా C12 ప్రో (Nokia C12 Pro)ను లాంచ్ చేసింది. ఈ నోకియా C12 ప్రో మోడల్ ఆక్టా-కోర్ ప్రాసెసర్, 2GB వర్చువల్ RAM సపోర్ట్, క్లీన్ ఆపరేటింగ్ సిస్టమ్ కలిగి ఉంది. ముందు వెనుక రెండింటికీ నైట్, పోర్ట్రెయిట్ కెమెరా మోడ్‌లు కలిగి ఉంది. సరసమైన ధర వద్ద ఉపయోగకరమైన ఫీచర్లను అందిస్తోంది. Nokia C12 Pro ఫోన్ 2GB RAM + 2GB వర్చువల్ RAM 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో కూడిన బేస్ మోడల్‌కు రూ. 6,999 ధరతో అందుబాటులో ఉంది.

రెండో మోడల్ 5GB RAM (3GB RAM + 2GB వర్చువల్ ర్యామ్‌తో సహా) 64GB ఇంటర్నల్ స్టోరేజీతో రూ.7999 ధరతో వస్తుంది. బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ లైట్ మింట్, చార్‌కోల్, డార్క్ సియాన్ అనే మూడు కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఈ కొత్త నోకియా స్మార్ట్‌ఫోన్‌ను రిటైల్ స్టోర్‌లు, ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లు (Nokia.com) నుంచి కొనుగోలు చేయవచ్చు. అదేవిధంగా, స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. నోకియా C12 Pro 6.3-అంగుళాల HD+ డిస్ప్లేతో వస్తుంది.

Read Also : Jio True 5G Services : దేశవ్యాప్తంగా జియో ట్రూ 5G సర్వీసులు.. కొత్తగా మరో 41 నగరాల్లోకి.. జియో వెల్‌కమ్ ఆఫర్ ఫ్రీగా పొందాలంటే?

8-MP వెనుక కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. ముందు ఫోన్‌లో సెల్ఫీలు, వీడియో కాల్‌ చేసేందుకు 5-MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఇది సరసమైన ఫోన్ అయినప్పటికీ.. నోకియా C12 ప్రోలో నైట్, పోర్ట్రెయిట్ వంటి కెమెరా మోడల్‌లు ఉన్నాయి. నోకియా C12 ప్లస్ Android 12 (Go ఎడిషన్) సాఫ్ట్‌వేర్‌పై రన్ అవుతుంది. ఈ ఫోన్ భారత మార్కెట్లో రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది.

Nokia C12 Pro Sale _ Nokia C12 Pro goes official, launched in India with price starting at Rs 6999

Nokia C12 Pro Sale : Nokia C12 Pro goes official, launched in India with price

అందులో 2GB RAM + 64GB స్టోరేజీ, 3GB RAM + 64GB స్టోరేజీ, 2GB వర్చువల్ RAM సపోర్టు కలిగి ఉన్నాయి. అదనపు RAM సపోర్టు మొత్తం పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ కొత్త నోకియా C12 ప్రో యూజర్లను HMD గ్లోబల్ వెల్లడించింది. ఈ ఫోన్ కనీసం రెండేళ్లపాటు సాధారణ సెక్యూరిటీ ప్యాచ్‌లను అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. Nokia C12 Proని 12 నెలల రీప్లేస్‌మెంట్ గ్యారెంటీతో అందిస్తామని కంపెనీ హామీ ఇచ్చింది.

నోకియా భారత్‌లో కొన్ని వారాల క్రితమే అనేక ఫోన్‌లను లాంచ్ చేస్తోంది. నోకియా C12 రూ. 5,999 ధరతో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ సెల్ఫీ కెమెరాను కలిగిన వాటర్‌డ్రాప్ నాచ్‌తో 6.3-అంగుళాల HD+ డిస్‌ప్లేతో వచ్చింది. Nokia C12లో 8-MP ఫ్రంట్ కెమెరా, 5-MP వెనుక కెమెరా సిస్టమ్, నైట్, పోర్ట్రెయిట్ వంటి మోడ్‌లు ఉన్నాయి.

Nokia C12 ఇతర స్పెసిఫికేషన్‌లలో కొన్ని Android 12 (Go ఎడిషన్), ఆక్టా-కోర్ ప్రాసెసర్, 2GB అదనపు వర్చువల్ RAM మరిన్ని ఉన్నాయి. నోకియా C12 అమెజాన్ ఇండియా (Amazon India)లో ప్రత్యేకంగా అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 2GB RAM, 64GB స్టోరేజీతో వస్తుంది. 2GB అదనపు మెమరీ పొడిగింపుతో పాటు 256GB వరకు అదనపు మెమరీకి సపోర్టు కూడా అందిస్తుంది.

Read Also : Jio Airtel Vi Offers : 2023లో బెస్ట్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా ప్లాన్లు ఇవే.. ఫుల్ లిస్టు ఇదిగో.. మరెన్నో OTT బెనిఫిట్స్ మీకోసం..!