Nokia G21 : ఏప్రిల్ 26న నోకియా కొత్త బడ్జెట్ ఫోన్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంత ఉండొచ్చంటే?
Nokia G21 : ప్రముఖ హెచ్ఎండీ గ్లోబల్ కంపెనీ నోకియా నుంచి కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ వస్తోంది. ఏప్రిల్ 26న Nokia G-Series స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ కానుంది.

Nokia G21 Launch In India Confirmed To Take Place On April 26 Expected Price, Specifications
Nokia G21 : ప్రముఖ హెచ్ఎండీ గ్లోబల్ కంపెనీ నోకియా నుంచి కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ వస్తోంది. ఏప్రిల్ 26న Nokia G-Series స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ మేరకు కంపెనీ G-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను ధృవీకరించింది. గత ఏడాది జూలైలో నోకియా G20 రిలీజ్ అయింది. అదేవిధంగా కొత్త Nokia G21 స్మార్ట్ ఫోన్ ఈ ఏడాది ప్రారంభంలో యూరప్‌లో లాంచ్ అయింది. నోకియా అదే ఫీచర్లతో డివైస్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేస్తోంది. నోకియా G21 స్మార్ట్ ఫోన్.. HD+IPS LCDని కొనసాగించనుంది. స్క్రీన్ 6.5-అంగుళాల పొడవు, ఫ్రంట్ కెమెరా, వాటర్‌డ్రాప్ నాచ్ కలిగి ఉంది. ఈ డివైజ్ వెనుక ప్యానెల్ కొన్ని డిజైన్ అప్‌గ్రేడ్‌లతో వస్తోంది. మునుపటి నోకియా జీ సిరీస్ మోడల్ సర్కిల్ మాడ్యూల్‌తో వచ్చింది. కానీ, ఇప్పుడు నోకియా జీ 21 సిరీస్ దీర్ఘచతురస్రాకార కెమెరా మాడ్యూల్ తో రానుంది.
ఈ డివైజ్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌తో రానుంది. 2MP మాక్రో కెమెరా, 2MP డెప్త్ సెన్సార్, 50MP ప్రధాన కెమెరా సెన్సార్ ఉంది. HMD గ్లోబల్ మునుపటి మోడల్‌లో 5MP అల్ట్రావైడ్ కెమెరాను తొలగించింది. వాటర్‌డ్రాప్ నాచ్‌లో 8MP ఫ్రంట్ కెమెరా సెన్సార్ అందిస్తోంది. ఈ ఫోన్ 5050mAh బ్యాటరీతో వచ్చింది. ఛార్జింగ్ విభాగంలో అప్‌గ్రేడ్‌తో చేస్తోంది. నోకియా నుంచి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ బాక్స్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో వస్తోంది. యూరోపియన్ రిటైల్ బాక్స్ 10W ఛార్జింగ్ అడాప్టర్‌తో రానుంది. భారత మార్కెట్లో G21 రిటైల్ బాక్స్‌లో HMD గ్లోబల్ 18W ఛార్జింగ్ సపోర్టుతో వస్తుందో లేదో రివీల్ చేయలేదు.

Nokia G21 Launch In India Confirmed To Take Place On April 26 Expected Price, Specifications
నోకియా జీ21 బడ్జెట్ ఫోన్ Unisoc T606 SoC ప్రాసెసర్‌తో వస్తోంది. ఇంటర్నేషనల్ మోడల్ Mali G57 GPUతో పాటు 4GB, 6GB RAMతో వస్తుంది. 128GB ఇంటర్నల్ స్టోరేజీతో రానుంది. మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజీని ఎక్స్ ఫ్యాండ్ చేసుకోవచ్చు. నోకియా ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో గ్లోబల్ వేరియంట్ రిలీజ్ చేసింది. ఈ డివైజ్ కనీసం 2 ఏళ్ల ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లతోపాటు మూడు ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లతో రానుంది. కనెక్టివిటీ విషయానికొస్తే.. ఈ ఫోన్ USB టైప్-C పోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, 4G VoLTE, బ్లూటూత్, GPS, Wi-Fi ఆప్షన్లతో వస్తోంది.
ఈ డివైజ్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, AI ఫేస్ అన్‌లాక్‌తో కూడా వస్తుంది. యూరోప్‌లో Nokia G21 ధర EUR 170 (దాదాపు రూ. 14,000) నుంచి ప్రారంభమవుతుంది. ఈ నోకియా G21 స్మార్ట్ ఫోన్ రెండు స్టోరేజ్ ఆప్షన్‌లలో వస్తోంది. నార్డిక్ బ్లూ డస్క్ కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఈ డివైజ్ భారత మార్కెట్లో ప్రారంభ ధర రూ. 13,000 నుంచి ఉంటుందని భావిస్తున్నారు.
Read Also : Nokia C01 Plus : నోకియా నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?