Nothing Phone (2) : నథింగ్ ఫోన్ (2) ఫోన్ వచ్చేస్తోంది.. ఇదిగో కీలక ఫీచర్ లీక్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?
Nothing Phone (2) : ప్రముఖ కార్ల్ పీ-హెడ్డ్ టెక్ కంపెనీ నథింగ్ (Nothing) నెక్స్ట్ స్మార్ట్‌ఫోన్‌ను ధృవీకరించలేదు. రాబోయే ఈ ఫోన్‌ను నథింగ్ ఫోన్ (2) అని పిలుస్తారు.

Nothing Phone (2) key specification revealed accidentally ahead of Ear (2) launch
Nothing Phone (2) : ప్రముఖ కార్ల్ పీ-హెడ్డ్ టెక్ కంపెనీ నథింగ్ (Nothing) నెక్స్ట్ స్మార్ట్‌ఫోన్‌ను ధృవీకరించలేదు. రాబోయే ఈ ఫోన్‌ను నథింగ్ ఫోన్ (2) అని పిలుస్తారు. బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) 2023 సందర్భంగా, నెక్స్ట్ నథింగ్ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ చిప్‌సెట్ ద్వారా రానుందని కంపెనీ ధృవీకరించింది. ఇప్పుడు, Qualcomm ఎగ్జిక్యూటివ్ అనుకోకుండా నథింగ్ ఫోన్ (2) స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్‌తో రానుందని ధృవీకరించారు. నథింగ్ ఫోన్ (2) గురించి వివరాలను రివీల్ చేయనుంది. Qualcomm SVP మొబైల్, కంప్యూట్ XR బిజినెస్ యూనిట్ GM, అలెక్స్ కటోజియన్ లింక్‌డిన్ పోస్ట్‌లో వెల్లడించారు.
నథింగ్ కంపెనీ నథింగ్ ఫోన్ (2) Qualcommతో భాగస్వామ్యాన్ని ప్రకటించిన తర్వాత ఫీచర్ లీక్ అయింది. నథింగ్ ఫోన్ (2) Qualcomm Snapdragon 8 Gen 1 ప్రాసెసర్‌తో రానుందని స్పష్టంగా పేర్కొంది. నథింగ్ ఫోన్ (1) స్నాప్‌డ్రాగన్ 778G+ ప్రాసెసర్ ద్వారా ఆధారితమైనది. రాబోయే నథింగ్ ఫోన్ పర్ఫార్మెన్స్ మరింత మెరుగుపడనుంది. ఈ నథింగ్ ఫోన్ (2) గురించి ఎలాంటి వివరాలను కంపెనీ వెల్లడించలేదు.

Nothing Phone (2) key specification revealed
మరో మాటలో చెప్పాలంటే.. నథింగ్ ఫోన్ (2) ఫోన్ (1) మాదిరిగా అదే గ్లిఫ్ డిజైన్‌ను అందించగలదు. స్పెషిఫికేషన్లు ఒక్కసారిగా మారే అవకాశం ఉంది. Pei గత ఫోన్ (2) ఫోన్ (1) కన్నా చాలా ఎక్కువ ప్రీమియంతో రానుందని ధృవీకరించింది. మెరుగైన నిర్మాణ నాణ్యత, హార్డ్‌వేర్ సెటప్‌ను సూచిస్తుంది. అద్భుతమైన స్పెసిఫికేషన్‌లతో, నథింగ్ ఫోన్ (2) ధర కూడా కొంచెం పెరిగే అవకాశం ఉంది.
ఈ నథింగ్ ఫోన్ (1) మూడు వేరియంట్‌లలో లాంచ్ కానుంది. బేస్ 8GB RAM ప్లస్ 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 32,999గా ఉండనుంది. ఇతర రెండు మోడల్స్ 8GB RAM+, 256GB స్టోరేజ్, 12GB RAM, 256GB స్టోరేజ్ ధర రూ. 35,999, రూ. 38999గా ఉండనుంది. కంపెనీ ఈ ఫోన్‌ను లాంచ్ చేసినప్పటి నుంచి ప్రతి నెలా పెద్ద డిస్కౌంట్‌లతో అందిస్తోంది.
నథింగ్ ఫోన్ (1)తో పోల్చినప్పుడు.. నథింగ్ ఫోన్ (2) ధర ఎక్కువగా ఉంటుంది. రాబోయే స్మార్ట్‌ఫోన్ గురించి కంపెనీ మరిన్ని వివరాలను రివీల్ చేయలేదు. ఇయర్ (2) లాంచ్ కూడా ధృవీకరించలేదు. మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అవుతుందని కంపెనీ వెల్లడించింది.