PV Sindhu: తమిళ్ సాంగ్‌కు నడి రోడ్డుపై పీవీ సింధు డ్యాన్స్

బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ప్లేయింగ్ కోర్టులో అటూ ఇటూ కదలడమే తప్ప.. ఇలా కొత్తగా డ్యాన్స్ చేస్తూ ముందెప్పుడూ చూసుండరు. సోమవారం సాయంత్రం నడిరోడ్డుపై తమిళ పాటకు డ్యాన్స్ వేస్తూ..

PV Sindhu: తమిళ్ సాంగ్‌కు నడి రోడ్డుపై పీవీ సింధు డ్యాన్స్

Pv Sindhu

PV Sindhu: బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ప్లేయింగ్ కోర్టులో అటూ ఇటూ కదలడమే తప్ప.. ఇలా కొత్తగా డ్యాన్స్ చేస్తూ ముందెప్పుడూ చూసుండరు. సోమవారం సాయంత్రం నడిరోడ్డుపై తమిళ పాటకు డ్యాన్స్ వేస్తూ అదరగొట్టింది. ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ లో పోస్టు చేసింది.

పీవీ సింధు డ్యాన్స్ తో వైరల్ అవడం తొలిసారి కాదు. కొద్ది రోజుల క్రితం కచ్చా బదాం పాటకు పసుపు డ్రెస్ లో మూమెంట్ చేస్తూ డ్యాన్స్ వేసింది. ఇక రీసెంట్ గా అనిరుధ్ రవిచందర్ కంపోజింగ్ లో వచ్చిన అనివీ పాటకు డ్యాన్స్ వేసింది.

బ్లూ డెనిమ్స్, పింక్ జాకెట్, క్యాప్ పెట్టుకుని మయకరియే అంటూ చిందులేస్తూ.. ఇన్‌స్టాలో డ్యాన్స్ ఈజ్ ద జాయ్ ఆఫ్ మూమెంట్ అంటూ క్యాప్షన్ పెట్టింది. సింధు చిందేస్తే అభిమానులు ఆగుతారా.. లక్షల్లో చూసేశారు. కచ్చాబదాం పాటను 8లక్షల మందికిపైగా లైక్ చేస్తే.. తమిళ పాటను రెండు లక్షల మంది లైక్ కొట్టారు.

Read Also : నేను కూడా ఎదుర్కొన్నా.. ట్రోలింగ్, సైబర్ బుల్లింగ్‌‌పై పీవీ సింధు

గతేడాది దేశంలో అత్యున్నత మూడో పురస్కారమైన పద్మ భూషణ్ అందుకున్నారు పీవీ సింధు. 2015లో ఇండియాలో నాలుగో అత్యున్నత పురస్కారమైన పద్మ శ్రీ అవార్డును సొంతం చేసుకున్నారు. 2016లో ఖేల్ రత్నాను కూడా దక్కించుకున్నారు సింధు.