Novak Djokovic: జకోవిచ్‌కు గత నెలలో కొవిడ్ వచ్చింది కాబట్టే..

కరోనా వ్యాక్సిన్ తప్పనిసరి అయినప్పటికీ.. ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీకి జకోవిచ్ ను అనుమతించడం చర్చనీయాంశంగా మారింది. వివాదాస్పదమవుతున్న ఈ అంశానికి చెక్ పెట్టేదిశగా ఫెడరల్‌ సర్క్యూట్‌.

Novak Djokovic: జకోవిచ్‌కు గత నెలలో కొవిడ్ వచ్చింది కాబట్టే..

Novak Djokovic

Novak Djokovic: కరోనా వ్యాక్సిన్ తప్పనిసరి అయినప్పటికీ.. ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీకి జకోవిచ్ ను అనుమతించడం చర్చనీయాంశంగా మారింది. వివాదాస్పదమవుతున్న ఈ అంశానికి చెక్ పెట్టేదిశగా ఫెడరల్‌ సర్క్యూట్‌ కోర్టుకు జకోవిచ్ తరపు లాయర్లు వివరణ ఇచ్చుకున్నారు.

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ నిబంధనల ప్రకారం… 6 నెలల కాలంలోపే కరోనా బారిన పడి కోలుకున్న వారు వ్యాక్సిన్‌ తీసుకోకపోయినప్పటికీ ప్రత్యేక మినహాయింపుతో గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో ఆడేందుకు అవకాశం ఉంటుంది. ఇదే క్రమంలో డిసెంబర్‌ 16వ తేదీన జకోవిచ్‌కు నిర్వహించిన కరోనా పరీక్షలో పాజిటివ్‌ వచ్చింది. ఆ సమయంలో ఎలాంటి జ్వరంగానీ, శ్వాస సంబంధిత ఇబ్బందులుగానీ కనిపించలేదు.

సెర్బియా స్టార్‌ తరఫు లాయర్లు శనివారం కోర్టుకు సమర్పించిన పత్రాలలో.. జకోవిచ్‌కు డిసెంబర్‌ 16న కరోనా పాజిటివ్‌ వచ్చిందని తెలిసినా అదే రోజు, ఆ మరుసటి రోజు బెల్‌గ్రేడ్‌లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొనడం గమనార్హం. 16వ తేదీన నొవాక్‌ జొకోవిచ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన ఒక సెమినార్‌లోనూ ఈ సెర్బియా స్టార్‌ పాల్గొన్నాడు.

ఇది కూడా చదవండి : ఆత్మకూరులో టెన్షన్..టెన్షన్

డిసెంబర్ 17న తన ముఖచిత్రంతో ముద్రించిన తపాళా బిళ్లను స్వయంగా విడుదల చేశాడు జకోవిచ్‌. ఈ రెండు కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలను జొకోవిచ్‌ తన ట్విట్టర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ కూడా చేశాడు. జనవరి 17న మొదలయ్యే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఆడేందుకు 5వ తేదీన మెల్‌బౌర్న్‌ వచ్చిన జకోవిచ్‌ అవసరమైన పత్రాలు లేవని ఆరోపిస్తూ జారీ చేసిన వీసాను రద్దు చేస్తూ.. ఆస్ట్రేలియా బోర్డర్‌ ఆఫీసర్లు అతణ్ని అడ్డుకున్నారు. ఆఫీసర్ల నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ జకోవిచ్‌ కోర్టును ఆశ్రయించాడు.