NTR Special Song: అంతయు నీవే తారకరామా.. ప్రేక్షకులకు బాలయ్య కృతజ్ఞతలు!

లెజెండరీ దివంగత నటుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా అశ్విన్ అట్లూరి అనే అభిమాని ఓ పాటను రూపొందించారు.

NTR Special Song: అంతయు నీవే తారకరామా.. ప్రేక్షకులకు బాలయ్య కృతజ్ఞతలు!

Ntr Special Song

NTR Special Song: లెజెండరీ దివంగత నటుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా అశ్విన్ అట్లూరి అనే అభిమాని ఓ పాటను రూపొందించారు. బుధవారం విడుదల చేసిన ఈ పాట యూట్యూబ్ లో భారీ వ్యూస్ సొంతం చేసుకోగా.. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పాట వైరల్ అవుతూనే ఉంది. ‘తెలుగు తల్లి చేసిన పుణ్యం.. తెలుగు తెరపై వెలసిన దైవం’ అంటూ సాగే ఈ పాట అభిమానులను ఆకట్టుకుంటుంది.

Balakrishna : గుర్రమెక్కిన ‘నటసింహం’.. నందమూరి ‘యువసింహం’..

అశ్విన్ అట్లూరి ఈ పాటను నిర్మించడమే కాకుండా.. లిరిక్స్ కూడా అందించారు. గాయకులు అంజనా సౌమ్య, స్వరాగ్ కీర్తన్ ఈ పాటను ఆలపించగా.. ‘బుల్లెట్టు బండి’ సాంగ్ కి సంగీతం అందించిన ఎస్కే బాజీ ఈ పాటకు మ్యూజిక్ కంపోజ్ చేశారు. గౌతమ్ రాజు ఎడిటింగ్ వర్క్ చేశారు.

Balakrishna : లెఫ్ట్ హ్యాండ్ కూడా రెడీ అయింది.. దొరికితే దవడ పగిలిపోద్ది.. బాలయ్య సీరియస్ వార్నింగ్

ఈ పాటపై బాలయ్య సైతం స్పందించారు. ఈ మేరకు తన ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టారు. రాజకీయ భీష్మ, ప్రజాభీష్ట నందమూరి తారక రామ మహాప్రస్థానాన్ని పాటగా రచించి, నిర్మించిన అశ్విన్ అట్లూరి గారికి మరియు వారి టీం కి నా అభినందనలు. ఓ ప్రజానాయకా, తెలుగుతల్లి పాడుతుంది నీ గీతికా ’నందమూరి తారక రామామృత’ గీతాన్ని అద్భుతంగా ఆదరిస్తున్న అన్నగారి అభిమానులకు, తెలుగు ప్రేక్షకులకు నా కృతఙ్ఞతలు. జై ఎన్టీఆర్.. జయహో ఎన్టీఆర్; జోహార్ ఎన్టీఆర్” అంటూ బాలకృష్ణ రాసుకొచ్చారు.

Balakrishna: బాలయ్య ఓపెన్ ఆఫర్స్.. అందుకొనే దర్శకులెవరో?

Anthayu Neeve Taraka Rama Song Lyrics in Telugu

తెలుగు తల్లి చేసిన పుణ్యం
తెలుగు తెరపై వెలసిన దైవం
తెలుగు నేలకు వచ్చిన ధైర్యం
తెలుగు భాషకు తెచ్చిన గర్వం
ఓ విశ్వ విఖ్యాత నట సార్వభౌమా
మా నందమూరి తారకరామా
మా నందమూరి తారకరామా

అంతయు నీవే తారకరామా
అంతము లేనిది నీపై ప్రేమా
అంతయు నీవే తారకరామా
అంతము లేనిది నీపై ప్రేమా

ఎక్కడ విన్నా నీ నామస్మరణా
ఎన్నడు మరువము చల్లని కరుణా

నేలను విడిచిన ఓ రామన్నా
మళ్ళీ రావా మా అన్నా..!!
మళ్ళీ రావా మా అన్నా

జయహో జోహారు ఎన్టీఆర్
తెలుగునాట నీ చరిత
సువర్ణాక్షరాల రాత
తెగువ చూపిన ఘనత
నిను మరవదు ఈ జనత

మడమ తిప్పనిది నీ నైజం
మైమరపించే రాజసం
కఠినమైన నీ క్రమశిక్షణా
కాలు దువ్వితే సింహగర్జనా

నీ రూపం (నీ రూపం)
ముగ్ధ మనోహరం (ముగ్ధ మనోహరం)
నీ పలుకే (నీ పలుకే)
తొలకరి మకరందం (తొలకరి మకరందం)

నీ పౌరాణిక పాత్రల సృష్టీ
వ్యాస వాల్మీకులె పెట్టిరి దిష్టీ

అంతయు నీవే తారకరామా
అంతము లేనిది నీపై ప్రేమా

గుప్పున రగిలిన నిప్పుల ఉప్పెన
నీలో ఆవేశం
గుప్పెడు గుండెను తట్టి లేపినది
నీ ఉపన్యాసం

నీ అభిమానం నదీ ప్రవాహం
ఆత్మాభిమానం అనంత గగనం
నీ పట్టుదలే ఈ మట్టి దృఢత్వం
నీ ప్రతి అడుగూ ఓ ప్రభంజనం

ఆ పంచభూతాలే కలిసీ
నిలిచాయి పంచెకట్టులో వెలసీ
పేదోళ్ళకు కంచంలొ అన్నమా
నీ అభిమానులకూ ‘అన్న’వే సుమా

అంతయు నీవే తారకరామా
(తారకరామా)
అంతము లేనిది నీపై ప్రేమా
(నీపై ప్రేమా)

పాతుకు పోయిన పాత పార్టీకి
పాతర వేసావూ
పేదల గుండెలె పసుపు జెండాగ
పైకెగరేసావూ

మన తెలుగోళ్ళను కించపరిచే
ఆ మదరాసీ ముద్ర చెరిపీ
ఖండాలూ తీరాలు దాటీ
చాటావే ఘన తెలుగు ఖ్యాతి

బలహీన వర్గాల దన్నుగా
నవ శకమే నిర్మించినావుగా

భరత జాతికే (భరత జాతికే)
శిరోరత్నమా (శిరోరత్నమా)
మహా నాయకా స్ఫూర్తిదాయకా
మహా నాయకా స్ఫూర్తిదాయకా

అంతయు నీవే తారకరామా
(తారకరామా)
అంతము లేనిది నీపై ప్రేమా
(నీపై ప్రేమా)