NTR: మరో పది రోజుల్లో ఎన్టీఆర్ సినిమా రీ-రిలీజ్.. ఏమిటో తెలుసా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన కెరీర్‌లోని 30వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా వస్తుండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా, మరో పది రోజుల్లో ఎన్టీఆర్ నటించిన సినిమా థియేటర్లలో రిలీజ్ కానుండటంతో అభిమానులు అవాక్కవుతున్నారు.

NTR: మరో పది రోజుల్లో ఎన్టీఆర్ సినిమా రీ-రిలీజ్.. ఏమిటో తెలుసా?

NTR Superhit Movie Baadshah Re-Release On Nov 19

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన కెరీర్‌లోని 30వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా వస్తుండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో ఎలాంటి తప్పులు లేకుండా చాలా పర్ఫెక్ట్ ప్లానింగ్ కోసం కొరటాల అండ్ టీమ్ మరింత సమయాన్ని తీసుకుంటున్నారు.

NTR-ANR: మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ట్వీట్.. వైరల్ అవుతున్న “NTR-ANR” క్రికెట్ వీడియో..

ఇక ఇదిలా ఉండగా, మరో పది రోజుల్లో ఎన్టీఆర్ నటించిన సినిమా థియేటర్లలో రిలీజ్ కానుండటంతో అభిమానులు అవాక్కవుతున్నారు. ఆర్ఆర్ఆర్ తరువాత తారక్ ఇంకా ఏ సినిమా మొదలేపెట్టలేదు.. అప్పుడే ఆయన సినిమా రిలీజ్ కావడం ఏమిటని అనుకుంటున్నారా.. తారక్ కెరీర్‌లో సూపర్ హిట్ కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా నిలిచిన బాద్‌షా సినిమా గురించి అందరికీ తెలిసిందే. దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ నవంబర్ 19న రీ-రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

NTR30: “NTR30” ప్రీ ప్రొడక్షన్ వర్క్స్‌లో వేగం పెంచిన కొరటాల..

తారక్ పర్ఫార్మెన్స్, కాజల్ అగర్వాల్ అందాలు, బ్రహ్మానందం కామెడీ కలగలిసి ఈ సినిమాను అప్పట్లో సూపర్ హిట్ మూవీగా నిలిపాయి. ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ ప్రొడ్యూస్ చేయగా, థమన్ సంగీతం అందించాడు. మరి 2013లో రిలీజ్ అయిన బాద్‌షా సినిమా, రీ-రిలీజ్‌లో ఎలాంటి రెస్పాన్స్‌ను దక్కించుకుంటుందో చూడాలి.