Odisha MLA : ప్రజల మీదకు దూసుకెళ్లిన ఎమ్మెల్యే కారు..ఏడుగురు పోలీసులతో సహా 20మందికి తీవ్ర గాయాలు

బ్లాక్ ఆఫీసు వద్ద గుమికూడి ఉన్న ప్రజలపైకి ఒక్కసారిగా ఆయన కారు దూసుకపోయింది. దీంతో 15 మంది బీజేపీ, ఒక బీజేడీ కార్యకర్తలతో సహా ఏడుగురు పోలీసులతో...

Odisha MLA : ప్రజల మీదకు దూసుకెళ్లిన ఎమ్మెల్యే కారు..ఏడుగురు పోలీసులతో సహా 20మందికి తీవ్ర గాయాలు

Odisha

Odisha MLA Prashant Jagdev : దేశంలో సంచలనం సృష్టంచిన లఖీంపూర్ ఘటన అందరికీ తెలిసిందే. నిరసన తెలుపుతున్న రైతులపై ఓ వాహనం దూసుకెళ్లడంతో నలుగురు రైతులు చనిపోగా పలువురికి గాయాలయ్యాయి. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశీష్ మిశ్రానే ఈ వాహనం నడిపాడని.. వెంటనే అతడిని కఠినంగా శిక్షించాలంటూ దేశ వ్యాప్తంగా ఆందోళనలు పెల్లుబికాయి. అచ్చు ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఓ ఎమ్మెల్యే కారు ప్రజలపైకి దూసుకెళ్లింది. దీంతో ఎంతో మందికి గాయాలయ్యాయి. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రజలంతా గుమికూడి ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఒడిశా రాష్ట్రంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Read More : Horn Not OK Please: ఇకపై హారన్‌ మోగిస్తే.. తప్పదు భారీ జరిమానా..!!

ఒడిశా ఖుర్దాలో ఎమ్మెల్యే ప్రశాంత్ జగదేవ్ చిక్కుల్లో పడ్డారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు గత సంవత్సరం బీజేడీ (BJD) నుంచి సస్పెండ్ కు గురయ్యారు. ఖోర్దా జిల్లాలోని బాన్ పూర్ లో బ్లాక్ ఛైర్మన్ పదవికి ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ప్రశాంత్… SUV వాహనంలో అక్కడకు వెళుతున్నారని సమాచారం. బ్లాక్ ఆఫీసు వద్ద గుమికూడి ఉన్న ప్రజలపైకి ఒక్కసారిగా ఆయన కారు దూసుకపోయింది. దీంతో 15 మంది బీజేపీ, ఒక బీజేడీ కార్యకర్తలతో సహా ఏడుగురు పోలీసులతో పాటు..20మందికి తీవ్ర గాయాలయ్యాయి.

Read More : Bhagavanth Maan: పంజాబ్ కొత్త సీఎంగా.. 16న భగవంత్ ప్రమాణం

తీవ్రంగా గాయపడిన ఓ మహిళను బాన్ పూర్ లోని ఆసుపత్రికి తరలించగా.. మరో ఇద్దరిని చికిత్స నిమిత్తం భువనేశ్వర్ ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు అతని కారుపై దాడికి పాల్పడ్డారు. వాహనం ధ్వంసం కావడంతో జగదేవ్ తలకు గాయాలయ్యాయి. దీంతో పోలీసులు అతడిని రక్షించి భువనేశ్వర్ లోని ఆసుపత్రికి తరలించారు. బీజేపీ నేత పృథ్వీ రాజ్ హరిచందన్ ప్రమాదస్థలాన్ని పరిశీలించేందుకు బయలుదేరారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నట్లు బాలుగావ్ SDPO తెలిపారు.