Horn Not OK Please: ఇకపై హారన్‌ మోగిస్తే.. తప్పదు భారీ జరిమానా..!!

ఇకపై హారన్‌ మోగిస్తే.. భారీ జరిమానా తప్పదు అని వార్నింగ్ ఇస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు..

Horn Not OK Please: ఇకపై హారన్‌ మోగిస్తే.. తప్పదు భారీ జరిమానా..!!

Horn Not Ok Please

Horn not OK please : వాహనాలపై వెళ్తున్నవారు కొంతమంది ఊరికనే హారన్ మోగిస్తుంటారు. అసరం లేకపోయినా హారన్ మోగిస్తుంటారు. ఇది ఇతరులకు ఇబ్బంది కలిగించటమే కాదు..శబ్ధకాలుష్యం కూడా. ఇక నుంచి ఎవరన్నా అలా అనవసరంగా హారన్ మోగిస్తే కుదరదు గాక కుదరదు. అలా అనవసరంగా హారన్ మోగిస్తే జరిమానా తప్పదంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఇప్పటికే ఇలా అనవసరంగా హారన్ మోగించిన 615 మంది వాహనదారులకు ట్రాఫిక్‌ పోలీసులు జరిమానా విధించారు. ఒక్కొక్కరికి రూ. 2 వేలు జరిమానా విధించారు. ఏంటీ హారన్ మోగిస్తేనే రూ.2వేలు ఫైనా? అని ఆశ్చర్యపోతున్నారా? నిజమే అదే చేశారు పశ్చిమ బెంగాల్‌ పోలీసులు. అవసరం లేకపోయిన ఊరికినే హారన్ మోగించే 615మందికి ఫైన్ వేశారు.

Also read : Minister KTR : కంటోన్మెంట్ అధికారులకు కేటీఆర్ వార్నింగ్.. ‘మంచినీళ్లు, క‌రెంట్ బంద్ చేస్తాం’

ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సౌండ్‌ పొల్యూషన్‌ను నివారించటానికి ట్రాఫిర్ పోలీసులు ఈ చర్యలు తీసుకుంటున్నారు. అలాగే వాహనదారుల్లో క్రమశిక్షణను పెంపొందించే ఉద్దేశ్యంతో..యాంటీ-హాంకింగ్‌ డ్రైవ్ (anti-honking drive) ప్రారంభించామని తెలిపారు. 2021 జూలై నుంచి కోల్‌కత్తా నగరంలో ప్రత్యేక యాంటీ-హాంకింగ్‌ డ్రైవ్‌లు చేపడుతున్నామని వెల్లడించారు. జూలై నెలలో ముఖ్యంగా కరోనా వ్యాక్సినేషన్‌ సెంటర్స్‌ వద్ద, ఆసుపత్రుల వద్ద స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టినట్టు తెలిపారు. దీంట్లో భాగంగా కేవలం 12 రోజుల్లోనే 1,264 వాహనదారులకు జరిమానా విధించామని ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన యాంటీ పొల్యూషన్ సెల్ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు.

Also read : Viral Video: దోబూచులాడిన అమ్మ: ముసుగు ధరించినా అమ్మను కనిపెట్టిన చిన్నారి

తాజగా యాంటీ-హాంకింగ్‌ డ్రైవ్‌ (anti-honking drive)లో భాగంగా 2022 ఫిబ్రవరి నెలలో ట్రాఫిక్ పోలీసులు రోజుకు సగటున 22 కేసులు నమోదు చేసామని చెప్పారు. ఎక్కువమంది వాహనదారులు రూల్స్‌ బ్రేక్‌ చేస్తూ హారన్‌ మోగిస్తున్నారని ఇది శబ్దకాలుష్యానికి కారణమవుతోందని తెలిపారు. దీంతో వాహనదారుల్లో క్రమశిక్షణ పెంచేందుకే 615 మంది వాహనదారులకు రూ. 2వేల చొప్పున జరిమానా విధించినట్టు ట్రాఫిక్‌ డీసీ అరిజిత్‌ సిన్హా పేర్కొన్నారు.

Also read : Telangana : శాతవాహన యూనివర్శిటీలో ఎలుగుబంటి సంచారం..భయాందోళనలో విద్యార్థులు

అయితే, కరోనా వైరస్‌ వ్యాప్తిలో భాగంగా లాక్‌డౌన్‌ విధించిన సమయంలో ట్రాఫిక్‌ భారీగా తగ్గిపోయి.. సౌండ్‌ పొల్యూషన్‌ తగ్గినట్టు పోలీసులు తెలిపారు. కరోనా రూల్స్‌ ఎత్తేయడం, సాధారణ స్థితికి పరిస్థితులు చేరుకోవడంతో మళ్లీ సౌండ్‌ పొల్యూషన్‌ పెరుగుతున్నట్టు చెప్పారు. దీంతో వాహనదారులపై ఫోకస్‌ పెంచినట్టు పోలీసులు తెలిపారు.