Viral Video: దోబూచులాడిన అమ్మ: ముసుగు ధరించినా అమ్మను కనిపెట్టిన చిన్నారి

నలుగురు మహిళలు ఒకే రకమైన చీరలు ధరించి ముఖంపై ముసుగు వేసుకున్నారు. వారిలో చిన్నారి తల్లి కూడా ఉన్నారు.

Viral Video: దోబూచులాడిన అమ్మ: ముసుగు ధరించినా అమ్మను కనిపెట్టిన చిన్నారి

Kid Mother

Viral Video: దేవుడు అన్నిచోట్లా ఉండలేక అమ్మను సృష్టించాడని కవులు చెబుతుంటారు. ఈ సృష్టిలో తల్లి తన పిల్లలకు అందించే ప్రేమకు సాటి మరొకటి లేదు. తల్లికి బిడ్డకు ఉన్న అనుబంధం మాటల్లో చెప్పలేనిది. పిల్లల ఆలనాపాలనా కనిపెట్టుకు కూర్చునే తల్లిని విడిచి చిన్నారులు నిముషమైనా ఉండలేరు. అమ్మ ఎక్కడున్నా బిడ్డ మనసు పసిగట్టేయగలదు. ఈ వీడియో చూడండి. ముసుగు ధరించి ఉన్నా.. ఓ చిన్నారి మాత్రం తన తల్లిని ఎలా గుర్తించిందో. నలుగురు మహిళలు ఒకే రకమైన చీరలు ధరించి ముఖంపై ముసుగు వేసుకున్నారు. వారిలో చిన్నారి తల్లి కూడా ఉన్నారు.

Also read: Operation To Cobra : నాగుపాము పొట్టలో ఇరుక్కున్న సారా సీసా మూత..ఆపరేషన్ చేసిన తొలగించిన డాక్టర్లు

ఇంతలో అమ్మను వెతుకుంటూ అక్కడికి వచ్చిన ఆ చిన్నారి ఆ నలుగురు మహిళల్లో తన తల్లి ఎవరో కనిపెట్టేందుకు కాస్త శ్రమించింది. చివరకు తన తల్లి ఒడికి చేరి..అమ్మ ఎవరో కనిపెట్టేసింది చిన్నారి. “status.fan.tranding” అనే ఇన్‌స్టాగ్రామ్ ఛానల్ లో ఈ వీడియో పోస్ట్ అయింది. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవగా..బిడ్డకు తల్లికి మధ్య అనుబంధం ఇదే కదా అంటూ నెటిజన్లు భావోద్వేగంగా స్పందిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by SFT (@status.fan.tranding)