Bollywood Films : ‘పుష్ప’ తో సహా రిలీజ్ డేట్స్ లాక్ చేసుకున్న పది సినిమాలు..

అల్లు అర్జున్ ‘పుష్ప’ పార్ట్ 1 (హిందీ వెర్షన్) తో పాటు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బాలీవుడ్ సినిమాల వివరాలు..

Bollywood Films : ‘పుష్ప’ తో సహా రిలీజ్ డేట్స్ లాక్ చేసుకున్న పది సినిమాలు..

Bollywood Films

Updated On : September 27, 2021 / 1:59 PM IST

Bollywood Films: పాండమిక్ కారణంగా అన్ని రంగాలతో పాటు సినీ పరిశ్రమ కూడా తీవ్ర సంక్షోభం ఎదుర్కొంది. షూటింగులు, రిలీజులు ఆగిపోయాయి.. థియేటర్లు మూత పడ్డాయి.. ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్‌తో పలు భాషలకు చెందిన సినీ జనాలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. దీంతో ఆగిపోయిన సినిమాల రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకునే పనిలో బిజీ అయిపోయారు మేకర్స్.. విడుదల తేదీలు ఖరారు చేసుకున్న హిందీ సినిమాల వివరాలు ఇలా ఉన్నాయి.

Jersey Movie : క్రేజీ డేట్ లాక్ చేసేశారు..

ఇటీవల ‘స్కామ్ 1992’ సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రతీక్ గాంధీ, ఐంద్రితా రే జంటగా.. హార్ధిక్ గజ్జార్ దర్శకత్వంలో నటించిన రొమాంటికి ఫిలిం ‘భావై’ (Bhavai) అక్టోబర్ 1న థియేటర్లలోకి రానుంది.

Bhavai

 

అక్ష‌య్‌కుమార్‌, క‌త్రినా కైఫ్‌, గుల్ష‌న్ గ్రోవ‌ర్ త‌దిత‌రులు న‌టించిన ‘సూర్య‌వంశీ’ చిత్రాన్ని రోహిత్ శెట్టి డైరెక్ట్ చేశారు. బాలీవుడ్‌లో ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్స్ సింగం, సింబాలుగా ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన అజ‌య్ దేవ‌గ‌ణ్‌, ర‌ణ్‌వీర్ సింగ్ ‘సూర్యవంశీ’లో స్పెష‌ల్ అప్పియ‌రెన్స్ ఇవ్వ‌డం విశేషం. ఈ దివాళీకి సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
వికాస్ వర్మ దర్శకత్వంలో ధృవ్ వర్మ హీరోగా తెరకెక్కుతున్న ‘నో మీన్స్ నో’ (No Means No) నవంబర్ 5న రానుంది.

83 - Sooryavanshi

‘బంటీ ఔర్ బబ్లీ’ కి సీక్వెల్‌గా ‘బంటీ ఔర్ బబ్లీ 2’ (Bunty Aur Babli 2) రూపొందుతోంది. సైఫ్ అలీ ఖాన్, రాణీ ముఖర్జీ జంటగా నటించగా.. వరుణ్ వి.శర్మ డైరెక్ట్ చేశారు. నవంబర్ 19న ఈ సినిమా రిలీజ్ అవనుంది.

Bunty Aur Babli 2

 

జాన్ అబ్రహాం ‘సత్యమేవ జయతే 2’ (Satyameva Jayate 2) నవంబర్ 26న.. అహాన్ శెట్టి, తారా సుతారియ హీరో హీరోయిన్లుగా మిలాన్ లుథారియా డెరెక్ట్ చేస్తున్న ‘తడప్’ (TADAP) డిసెంబర్ 3న.. అభిషేక్ కపూర్ దర్శకత్వంలో ఆయుష్మాన్ ఖురానా, వాణీ కపూర్ నటిస్తున్న రొమాంటిక్ డ్రామా ‘ఛండీగర్ కరే ఆషికీ’ (Chandigarh Kare Aashiqui) డిసెంబర్ 10న.. క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ బయోపిక్‌గా రూపొందిన ‘83’ (83 The Film), అల్లు అర్జున్ – సుకుమార్ కలయికలో వస్తున్న పాన్ ఇండియా ఫిలిం ‘పుష్ప’ పార్ట్ -1 (PUSHPA – Part 1) క్రిస్మస్‌కి.. షాహిద్ కపూర్ నటించిన తెలుగు ‘జెర్సీ’ రీమేక్ హిందీ ‘జెర్సీ’ డిసెంబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Chandigarh Kare Aashiqui