Ola Electric Scooter : ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్.. కొనుగోలుదారులకు నేరుగా హోం డెలివరీ!

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్ చేసుకున్నారా? దేశవ్యాప్తంగా కొనుగోలుదారులకు నేరుగా హోం డెలివరీ చేయనుంది కంపెనీ. ఇప్పటికే ఓలా ఈ-స్కూటర్ బుకింగ్స్ లక్ష దాటేశాయి. కేవలం 24 గంటల్లోనే లక్షల్లో బుకింగ్స్ చేసుకున్నారు.

Ola Electric Scooter : ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్.. కొనుగోలుదారులకు నేరుగా హోం డెలివరీ!

Ola Electric Scooter Buyers To Get Home Delivery Across India

Ola Electric scooter buyers : ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్ చేసుకున్నారా? దేశవ్యాప్తంగా కొనుగోలుదారులకు నేరుగా హోం డెలివరీ చేయనుంది కంపెనీ. ఇప్పటికే ఓలా ఈ-స్కూటర్ బుకింగ్స్ లక్ష దాటేశాయి. కేవలం 24 గంటల్లోనే లక్షల్లో బుకింగ్స్ చేసుకున్నారు ఆసక్తిగల కస్టమర్లు. అయితే బుకింగ్ చేసుకున్న కొనుగోలుదారుల కోసం దేశవ్యాప్తంగా హోం డెలివరీ చేసేందుకు ఓలా కంపెనీ ప్లాన్ చేస్తోంది. Ola Series S ఎలక్ట్రిక్ స్కూటర్.. ఇక నేరుగా కొనుగోలుదారుల ఇంటికే డెలివరీ అయిపోతుంది. ఓలా కొత్త ప్లాన్ ప్రకారం.. డైరెక్ట్ టూ కన్‌జ్యూమర్ సేల్స్ మోడల్ కింద డెలివరీ చేయనుంది. ఈ మొత్తం కొనుగోలు ప్రక్రియ అంతా తయారీదారుకి కొనుగోలుదారులకు మధ్య జరుగనుంది.

దీనికి ఓలా డీలర్ షిప్ నెట్ వర్క్ అవసరం లేకుండానే నేరుగా కస్టమర్లకు ఈ స్కూటర్లను డెలివరీ చేయనుంది. ఇందుకోసం ఓలా కంపెనీ కొన్ని వేర్వేరు లాజిస్టిక్స్ డిపార్ట్ మెంట్ ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా కొనుగోలు ప్రాసెస్ రన్ చేయనుంది. ఈ స్కూటర్ల కొనుగోలుపై కస్టమర్లు పూర్తిగా డాక్యుమెంట్లు, లోన్ అప్లికేషన్ సంబంధిత అన్ని విషయాలు ఆన్ లైన్ లోనే సమర్పించాల్సి ఉంటుంది. లాజిస్టిక్ టీమ్.. స్కూటర్ రిజిస్టర్ చేసుకున్న కొనుగోలుదారులకు నేరుగా ఇంటికే డెలివరీ చేస్తారు. ఇప్పటి వరకు, లగ్జరీ కార్ల తయారీ సంస్థలైన Mercedes-Benz and Jaguar Land Rover కస్టమర్లకు తమ వాహనాలను ఇంటికి డెలివరీ చేస్తున్నాయి.

అయితే ఓలా ఈ తరహా మోడల్‌ను అమలు చేసిన మొదటి కంపెనీగా అవతరించనుంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ Ola S1 రేంజ్-టాపింగ్, Ola S1 Pro వేరియంట్లలో లభించనుంది. సంస్థ matte black, matte pink, sky blue, white సహా మరిన్ని కలర్ ఆప్షన్లలో లభ్యం కానుంది. ఈ-స్కూటర్ ధర విషయానికి వస్తే.. స్కూటర్ ధర రూ.80వేల నుంచి రూ.1.1 లక్షల వరకు ఉంటుందని అంచనా. అంతకుముందు, కంపెనీ జూలై 15న ఓలా సిరీస్ S కోసం ఓపెన్ బుకింగ్స్ ప్రారంభించింది. రూ .499 రిజర్వేషన్ చేసుకోవాలి. ఈ మొత్తం పూర్తిగా రిఫండబుల్ కూడా. కేవలం 24 గంటల్లోనే ఈ-స్కూటర్ లక్షల్లో బుకింగ్స్ చేసుకున్నారు.