Ola S1 Pro: మరో వివాదంలో ఓలా స్కూటర్.. వినియోగదారుడి ట్వీట్

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ చుట్టూ ఇటీవల అనేక వివాదాలు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఓలా స్కూటర్ కాలిపోవడం, బ్యాటరీలు పేలిపోవడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా ఓలా స్కూటర్ మరో ఘటనకు కారణమైంది.

Ola S1 Pro: మరో వివాదంలో ఓలా స్కూటర్.. వినియోగదారుడి ట్వీట్

Ola

Ola S1 Pro: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ చుట్టూ ఇటీవల అనేక వివాదాలు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఓలా స్కూటర్ కాలిపోవడం, బ్యాటరీలు పేలిపోవడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా ఓలా స్కూటర్ మరో ఘటనకు కారణమైంది. నెమ్మదిగా నడుస్తున్నప్పుడు ఉన్నట్టుండి, ఫ్రంట్ సస్పెన్షన్ విరిగిపోయనట్లు వినియోగదారుడు ఒకరు ట్వీట్ చేశారు. శ్రీధర్ మీనన్ అనే వినియోగదారుడు ఈ ఘటనకు సంబంధించిన వివరాల్ని ట్వీట్‌లో పేర్కొన్నాడు.

Bypoll Schedule: ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఏపీలో అసెంబ్లీ స్థానానికి కూడా

‘‘నెమ్మదిగా నడుపుతున్నప్పుడు ఉన్నట్టుండి ఫ్రంట్ ఫోర్క్ విరిగిపోయింది. ఇది చాలా ప్రమాదకరం. దీనికి రీప్లేస్ చేయండి లేదా డిజైన్ మార్చి, వినియోగదారుల ప్రాణాల్ని కాపాడండి. నాణ్యత లేని మెటీరియల్‌ వాడి ప్రమాదాలకు గురయ్యేలా చూడకండి’’ అని ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఈ ఘటనలో శ్రీధర్ మీనన్‌కు చెందిన ఓలా ఎస్1 ప్రొ బైక్ ఫ్రంట్ వీల్ పూర్తిగా, హ్యాండిల్ బార్ నుంచి విడిపోయినట్లు ఫొటోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ట్వీట్‌ను ఓలా సీఈవోకు కూడా ట్వీట్ చేశాడు శ్రీధర్. దీనికి నెటిజన్లు కూడా రిప్లై ఇస్తున్నారు. ఓలా విషయంలో తాము కూడా ఎదుర్కొన్న ఘటనల్ని వివరిస్తున్నారు. ఈ ఘటనపై కంపెనీ ఎలా స్పందిస్తుందో చూడాలి.